Ch Malla Reddy: మల్లారెడ్డి యూనివర్సిటీలో బిల్డింగ్ నుంచి కిందకు దూకే ప్రయత్నం చేసిన విద్యార్థిని... ఇదిగో వీడియో

- నాలుగో అంతస్తులోని కిటికీ నుంచి కిందకు దూకే ప్రయత్నం
- ఉమెన్స్ క్యాంపస్ బిల్డింగ్ నుంచి దూకే ప్రయత్నం
- కాపాడిన సెక్యూరిటీ సిబ్బంది, తోటి విద్యార్థులు
మేడ్చల్ జిల్లాలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఓ విద్యార్థిని నాలుగో అంతస్తులో ఉన్న గది కిటికి నుంచి కిందకు దూకే ప్రయత్నం చేసింది. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది, తోటి విద్యార్థులు ఆమెను కాపాడారు. క్యాంపస్ పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఒకరు ఆత్మహత్యాయత్నం చేసింది.
ఈ క్రమంలో యూనివర్సిటీలోని ఉమెన్స్ క్యాంపస్ బిల్డింగ్ పై నుంచి కిందకు దూకే ప్రయత్నం చేసింది. ఆ విద్యార్థిని పరీక్షల్లో కాపీ కొడుతూ పట్టుబడటంతో అవమానంగా భావించి ఆత్మహత్యాయత్నం చేసిందని కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.