Prabhas: బ్లాక్‌బస్టర్‌ సీక్వెల్‌కు కూడా ప్రభాస్‌ డేట్స్‌ కష్టమే!

Prabhas dates are difficult even for the blockbuster sequel
  • 'కల్కి'  చిత్రానికి సీక్వెల్‌ను ప్లాన్‌ చేస్తున్న దర్శకుడు 
  • ప్రభాస్ డేట్స్‌ కోసం వెయిటింగ్‌ 
  • స్ట్రాంగ్‌ లైనప్‌తో ప్రభాస్‌ సినిమాలు
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న పాన్‌ ఇండియా స్టార్‌ ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాసే అని చెప్పాలి. 'కల్కి 2898ఏడీ' లాంటి ఘన విజయం తరువాత ఆయన ప్రస్తుతం రెండు సినిమాల చిత్రీకరణతో బిజీగా ఉన్నాడు. మారుతి దర్శకత్వంలో నటిస్తున్న 'రాజా సాబ్‌' చిత్రంతో పాటు హను రాఘవ పూడి డైరెక్షన్‌లో 'ఫౌజీ' చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల తరువాత సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్‌' చిత్రం కూడా ప్రారంభం కానుంది. 

అయితే ప్రభాస్‌ నటించిన 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి సీక్వెల్‌ను ప్లాన్‌ చేస్తున్నారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. మొదటి భాగం చిత్రీకరణలోనే పార్ట్‌-2కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాడు దర్శకుడు. అయితే మేజర్‌గా చేయాల్సిన చిత్రీకరణ బ్యాలెన్స్‌గానే ఉంది. చిత్రీకరణ మొదలు పెట్టడానికి ప్రభాస్‌ డేట్స్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాడు నాగ్‌ అశ్విన్‌. అయితే మొదట్లో కల్కి రెండో పార్ట్‌ను 2025 జూన్‌ నుండి చిత్రీకరణ మొదలు పెట్టి 2026లో చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేశారు. 

కాగా ప్రస్తుతం ప్రభాస్‌ వరుస చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల 'కల్కి-2 'సీక్వెల్‌ ప్లాన్‌ మారినట్లుగా తెలిసింది. 2026 ఎండింగ్‌లో లేదా  2027లో చిత్రాన్ని రిలీజ్‌ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. ఆల్‌రెడీ బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించిన చిత్రానికి కూడా ప్రభాస్‌ డేట్స్‌ దొరకడమే కష్టంగా ఉందంటే ప్రభాస్‌ లైనప్‌ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు
Prabhas
kalki 2898 ad
Kalki
Prabhas latest film
Prabhas latest news
Nag Ashwin
Kalki latest news
Tollywood
Entertainment
Kalki 2
Raja Saab
Fauji
Tollywood news

More Telugu News