Sachin Tendulkar: రేపు సచిన్ టెండూల్కర్‌కు బీసీసీఐ పురస్కారం

Sachin Tendulkar likely to get BCCI Lifetime Achievement Award
  • వార్షికోత్సవంలో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారం అందచేయనున్న బీసీసీఐ
  • భారత క్రికెట్‌కు సచిన్ ఎన్నో సేవలు అందించారన్న బీసీసీఐ
  • సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకుంటున్న 30వ క్రికెటర్
భారత క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌ను బీసీసీఐ సత్కరించనుంది. రేపు జరగబోయే వార్షికోత్సవంలో మాస్టర్ బ్లాస్టర్‌కు 'లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారం' అందజేయనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. 

'సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ ఆఫ్ ది ఇయర్-2024' అవార్డును సచిన్‌కు ప్రదానం చేయనున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. భారత క్రికెట్‌కు సచిన్ ఎన్నో సేవలు అందించారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును స్వీకరించబోయే 30వ భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్. గత ఏడాది మాజీ కోచ్ రవిశాస్త్రి, మాజీ క్రికెటర్ ఫరూక్ ఇంజినీర్‌కు ఈ అవార్డును ప్రదానం చేశారు. 

51 ఏళ్ల సచిన్ టెండూల్కర్ 664 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. వన్డేలు, టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ పేరిట ఉంది. సచిన్ 200 టెస్టులు, 463 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 15,921... వన్డేల్లో 18,426 పరుగులు చేశారు. సచిన్ ఒకే ఒక్క అంతర్జాతీయ టీ20 ఆడాడు. తన సుదీర్ఘ కెరీర్ లో సచిన్ 100 సెంచరీలు, 201 వికెట్లు సాధించడం విశేషం.
Sachin Tendulkar
Cricket
BCCI

More Telugu News