Nara Lokesh: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh told DSC Notification will be released after MLC election code concluded
  • డీఎస్సీ అభ్యర్థులకు తియ్యని కబురు చెప్పిన కూటమి ప్రభుత్వం
  • మార్చిలో డీఎస్సీ నోటిఫికేషన్
  • విద్యా సంవత్సరం ప్రారంభంలోపే నియామకాలు పూర్తి
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ డీఎస్సీ అభ్యర్థులకు తియ్యని కబురు చెప్పారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. డీఎస్సీ ప్రక్రియ మార్చిలో ప్రారంభించి విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే లోపే పూర్తి చేస్తామని తెలిపారు. ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్  జరగనుండడం తెలిసిందే. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 

మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రలో 80 శాతం టీచర్ నియామకాలు చేపట్టింది తామేనని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతోందని, విద్యా రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో టీచర్ల అభిప్రాయాలు ఉంటాయని వివరించారు. 

విద్యాశాఖ కమిషనర్ ప్రతి శుక్రవారం ఉపాధ్యాయుల సమస్యలు వింటున్నారని, ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకత కోసం ట్రాన్స్ ఫర్ యాక్ట్ తీసుకువస్తున్నామని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. 

విద్యా వ్యవస్థలో అనాలోచిత నిర్ణయాలు తీసుకోకూడదని, అందుకే తమ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో భాగస్వాములతో చర్చించాకే నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు.
Nara Lokesh
DSC
Teachers
Andhra Pradesh

More Telugu News