Flight Crash: అమెరికాలో మరో విమాన ప్రమాదం.. ఫిలడెల్ఫియాలో కూలిన చిన్న విమానం.. ఆరుగురి మృతి?

Another flight crash in USA Small plane crashes in Philadelphia
  • ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు ప్రయాణికులు
  • విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లు, కార్లు దగ్ధం
  • టేకాఫ్ అయిన కాసేపటికే ప్రమాదం
అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. ఆరుగురితో ప్రయాణిస్తున్న ఓ చిన్న విమానం ఫిలడెల్ఫియాలో కుప్పకూలింది. ఓ మాల్ సమీపంలో విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లకు నిప్పు అంటుకుని మంటలు ఎగసిపడ్డాయి. పలు కార్లు కూడా కాలి బూడిదయ్యాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ప్రకారం శుక్రవారం సాయంత్రం రూజ్‌వెల్ట్ మాల్ సమీపంలో జరిగిందీ ఘటన.

ఇటీవల వాషింగ్టన్ విమానాశ్రయ సమీపంలో ప్రయాణికుల విమానం, మిలటరీ హెలికాప్టర్ ఢీకొన్న ఘటనలో 67 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజుల వ్యవధిలోనే ఇప్పుడు మరో ప్రమాదం జరగడంతో అందరూ ఉలిక్కి పడ్డారు. తాజా ప్రమాదంలో లీర్‌జెట్ 55 విమానం ఈశాన్య ఫిలడెల్ఫియా విమానాశ్రయం నుంచి మిస్సోరిలోని స్ప్రింగ్‌ఫీల్డ్-బ్రాసన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరింది. అయితే, టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. విమానాశ్రయానికి 5 కిలోమీటర్ల లోపే విమానం ప్రమాదానికి గురైనట్టు అధికారులు తెలిపారు. విమానంలో ఇద్దరు మాత్రమే ఉన్నట్టు ఎఫ్ఏఏ చెబుతుండగా, ఆరుగురు ఉన్నట్టు ట్రాన్స్‌పోర్టేషన్ సెక్రటరీ సీన్ డఫీ నిర్ధారించారు. వారందరూ మరణించి ఉంటారని భావిస్తున్నారు. 
Flight Crash
Philadelphia
USA
Learjet 55 Aircraft

More Telugu News