centre: పనిగంటల అంశంపై కేంద్రం స్పందన

no proposal to increase working hours to 70 or 90 hours per week says centre
  • పని గంటలను పెంచే ప్రతిపాదన లేదన్న కేంద్రం
  • ఉద్యోగుల పని గంటల పెంపుపై పలువురు కార్పొరేట్ దిగ్గజాల వ్యాఖ్యలు
  • లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కార్మిక, ఉపాధి కల్పన సహాయ మంత్రి శోభా కరంద్లాజే 
ఉద్యోగుల పని గంటల పెంపు అంశంపై పలువురు కార్పొరేట్ దిగ్గజాలు చేస్తున్న వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం దీనిపై మరోసారి క్లారిటీ ఇచ్చింది. పని గంటలను వారానికి 70 లేదా 90 గంటలకు పెంచే ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని స్పష్టం చేసింది. 

కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఈమేరకు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కార్మికుల అంశం ఉమ్మడి జాబితాలో ఉందని, ఆ చట్టాల అమలును రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం వారి అధికార పరిధిలో నిర్వహిస్తాయని తెలిపారు.

చట్టాల అమలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో సెంట్రల్ ఇండస్ట్రియల్ రిలేషన్ మెషినరీ (సీఐఆర్ఎం) తనిఖీ అధికారులు చూడగా, రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు పర్యవేక్షిస్తాయని మంత్రి పేర్కొన్నారు. 
centre
increase working hours

More Telugu News