USAID: 9,700 మంది యూఎస్ ఎయిడ్ ఉద్యోగులపై ట్రంప్ వేటు!

Trump Administration To Fire Over 9700 USAID Staff
  • ప్రపంచవ్యాప్తంగా మానవతా సాయం అందిస్తున్న యూఎస్ ఎయిడ్ 
  • దాంట్లో 10 వేల మందికిపైగా ఉద్యోగులు
  • ఆ సంఖ్యను 300 కంటే తక్కువకు కుదించాలని యోచన
  • ఇప్పటికే పలువురికి టెర్మినేషన్ నోటీసులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్ ఎయిడ్) సిబ్బందిలో 9,700 మందిని ఇంటికి పంపాలని నిర్ణయించారు. ఈ సంస్థలో మొత్తం 10 వేల మంది ఉండగా, ఆ సంఖ్యను 300 కంటే తక్కువకు కుదించాలని నిర్ణయించారు. ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆఫ్రికా బ్యూరోలో 12 మందిని, ఆసియా బ్యూరోలో 8 మంది సహా మొత్తం 294 మందిని మాత్రం ఉంచి మిగతా ఉద్యోగులను తొలగించాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రపంచవ్యాప్తంగా నేరుగా నియమించిన యూఎస్ ఎయిడ్ ఉద్యోగులందరినీ సెలవులో పంపబోతున్నట్టు ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. అలాగే, విదేశాల్లో పనిచేస్తున్న వేలాదిమందిని వెనక్కి పిలిపించింది. ప్రభుత్వ నిర్ణయంతో వేలాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోనున్నాయన్న ఆందోళన కనిపిస్తోంది. ఇప్పటికే కొందరికి తొలగింపు నోటీసులు అందినట్టు తెలిసింది.   

యూఎస్ ఎయిడ్ అనేది మానవతా సహాయ సంస్థ. ఇది 2023లో 130 దేశాల్లో సాయం అందించింది. ఇది సాయం అందించిన దేశాలు చాలా వరకు అంతర్యుద్ధాలు, నిత్య సంఘర్షణలతో ఛిన్నాభిన్నమవుతూ తీవ్ర పేదరికంలో ఉన్నవే. సీఆర్ఎస్ నివేదిక ప్రకారం.. యూఎస్ ఎయిడ్ సాయం అందుకున్న వాటిలో ఉక్రెయిన్, ఇథియోపియా, జోర్డాన్, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సోమాలియా, యెమెన్, ఆఫ్ఘనిస్థాన్ వంటి దేశాలున్నాయి. 
USAID
USA
Donald Trump

More Telugu News