Naga Chaitanya: శోభిత పోస్టుకు చైతూ ఆస‌క్తిక‌ర రిప్లై.. మీ బాండింగ్ చాలా బాగుందంటూ నెటిజ‌న్ల కామెంట్స్‌!

Naga Chaitanya Interesting Replyto His Wifes Story the Post Went Viral
  
అక్కినేని నాగ‌చైత‌న్య‌, చందు మొండేటి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తండేల్ చిత్రం ఈరోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ మూవీ రిలీజ్ సంద‌ర్భంగా నాగ‌చైత‌న్య అర్ధాంగి శోభిత ధూళిపాళ్ల చిత్ర బృందానికి విషెస్ చెబుతూ ఇన్‌స్టా వేదిక‌గా ఆస‌క్తిక‌ర పోస్టు పెట్టారు. 

ఈ సినిమాపై చైతూ చాలా దృష్టి సారించార‌ని, చేస్తున్న‌న్ని రోజులు పాజిటివ్‌గా ఉన్నార‌ని పేర్కొన్నారు. "ఫైన‌ల్లీ గ‌డ్డం షేవ్ చేస్తావు. మొద‌టిసారి నీ ముఖం ద‌ర్శ‌నం అవుతుంది సామీ" అంటూ చైతూను ఉద్దేశిస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ఈ మూవీ కోసం చాలా రోజులుగా ఆయ‌న గ‌డ్డం లుక్‌లోనే ఉన్న విష‌యం తెలిసిందే. 

ఇక భార్య త‌న‌ను ఉద్దేశించి చేసిన పోస్టుపై నాగ‌చైత‌న్య స్పందించారు. "థ్యాంక్యూ మై బుజ్జి తల్లి" అని రిప్లై ఇచ్చారు. దీంతో ఈ పోస్టు కాస్తా సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. దీనిపై మీ బాండింగ్ చాలా బాగుందంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, శోభిత‌, నాగ‌చైత‌న్య‌ గ‌తేడాది డిసెంబ‌ర్ 4న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే.  

Naga Chaitanya
Thandel
Tollywood

More Telugu News