Chiranjeevi: 'లైలా' ప్రీరిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్... ఇన్‌స్టా పోస్టుతో క‌న్ఫ‌ర్మ్ చేసిన విష్వక్సేన్

Chiranjeevi To Be The Chief Guest for Laila Pre Release Event Vishwak Sen Confirms With Insta Post
  • విష్వక్సేన్, రామ్‌నారాయ‌ణ్ కాంబినేష‌న్‌లో 'లైలా'
  • ఈ నెల‌ 14న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సినిమా
  • త్వ‌ర‌లోనే ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రెడీ అవుతున్న మేక‌ర్స్‌
  • ఈ వేడుక‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నార‌ని వార్త‌లు
  • వాటికి బ‌లం చేకూరుస్తూ తాజాగా హీరో విష్వక్సేన్ ఇన్‌స్టా పోస్టు
టాలీవుడ్ యంగ్ హీరో విష్వక్సేన్, ద‌ర్శ‌కుడు రామ్‌నారాయ‌ణ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం 'లైలా'. ఈ మూవీలో తొలిసారి విష్వక్‌ లేడీ గెట‌ప్‌లో క‌నిపించ‌నున్నారు. ఈ మూవీ ప్రేమికుల రోజు సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే చిత్ర బృందం ప్ర‌చార కార్య‌క్ర‌మాలను జోరుగా నిర్వ‌హిస్తోంది. త్వ‌ర‌లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వ‌హించేందుకు మేక‌ర్స్‌ రెడీ అవుతున్నారు. 

అయితే, వేడుక‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నార‌ని ఇటీవ‌ల వార్త‌లు వచ్చాయి. వాటికి బ‌లం చేకూరుస్తూ తాజాగా హీరో విష్వక్సేన్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా చేసిన పోస్టు ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ పోస్టు ద్వారా ఆయ‌న ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చిరు చీఫ్ గెస్ట్ అని క‌న్ఫ‌ర్మ్ చేశారు. 

నిర్మాత సాహు గార‌పాటి, విష్వక్సేన్ మెగాస్టార్ ఇంటికి వెళ్లి ఆయ‌న‌ను ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఆహ్వానించారు. దీనికి చిరంజీవి కూడా ఓకే చెప్పిన‌ట్లు తెలిపారు. ఆయ‌న‌కు పూల మాల వేసి, ఓ బ‌హుమ‌తి ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా తీసిన ఫొటోల‌ను విష్వక్ త‌న ఇన్‌స్టా ఖాతా ద్వారా పంచుకున్నారు. 

"మా ఆహ్వానాన్ని మన్నించి 'లైలా'కు మద్దతు ఇవ్వడానికి వస్తున్న‌ మెగాస్టార్ చిరంజీవి గారికి ధన్యవాదాలు. సినిమాకు మీరు ఎల్లప్పుడూ బేషరతుగా మద్దతు ఇస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు" అని విష్వక్సేన్ త‌న్ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు.  
Chiranjeevi
Laila Movie
Vishwak Sen
Instagram
Tollywood

More Telugu News