USA: అమెరికా బహిష్కరణ జాబితాలో 487 మంది భారతీయులు: విదేశాంగ శాఖ

487 Presumed Indians With Final Removal Orders says Centre On US Deportations
  • అక్రమ వలసదారులపై అమెరికా కఠిన వైఖరి
  • 104 మంది భారతీయులను వెనక్కి పంపిన అగ్రరాజ్యం
  • సంకెళ్లతో వెనక్కి పంపించడంపై భారత్ ఆందోళన తెలియజేశామన్న విదేశాంగ శాఖ
అమెరికా బహిష్కరణకు గురైన వారి తుది జాబితాలో 487 మంది భారతీయులు ఉన్నారని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అక్రమ వలసదారుల తరలింపులో భాగంగా ఇదివరకే 104 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపింది. ఈ నేపథ్యంలో అమెరికా బహిష్కరణ తుది జాబితాలో ఎంతమంది ఉన్నారనే విషయాన్ని విదేశాంగ శాఖ వెల్లడించింది.

అదే సమయంలో, భారతీయులను సంకెళ్లతో తరలించిన అంశంపై కూడా విదేశాంగ శాఖ స్పందించింది. ఈ విషయమై అమెరికా వద్ద తమ ఆందోళనను తెలియజేశామని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన తెలిపారు.
USA
India
NRI

More Telugu News