akkineni nagarjuna: 'తండేల్' విజయంపై నాగార్జున స్పందన

akkineni nagarjuna wishes his son naga chaitanya nad thandel team
  • తన కుమారుడు నాగచైతన్యను చూస్తుంటే తండ్రిగా గర్వపడుతున్నానన్న నాగార్జున
  • నీ ప్యాషన్, కష్టానికి నిదర్శనమంటూ ప్రశంసలు 
  • డైరెక్టర్, తండేల్ టీమ్, నిర్మాతలకు బిగ్ థాంగ్స్ చెప్పిన నాగార్జున
నాగచైతన్య నటించిన 'తండేల్' చిత్రం విజయవంతం కావడంపై అక్కినేని నాగార్జున ఎక్స్ వేదికగా స్పందించారు. తన కుమారుడు నాగచైతన్యను చూస్తుంటే తండ్రిగా గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 'తండేల్' సినిమా విజయం సాధించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 

"డియర్ చైతన్య.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. ఈ సినిమా కోసం నువ్వు సవాళ్లు ఎదుర్కోవడం, నటుడిగా పరిధులు దాటడం చూశాను. 'తండేల్' సినిమా మాత్రమే కాదు, నీ ప్యాషన్, కష్టానికి నిదర్శనం. అక్కినేని అభిమానులారా.. మీరంతా కుటుంబ సభ్యుల్లాగా ఎప్పుడూ మా వెన్నంటే ఉన్నారు. 

మీ ప్రేమ, సపోర్టుకు ధన్యవాదాలు. సాయి పల్లవికి అభినందనలు.  దేవిశ్రీ ప్రసాద్ నువ్వు రాకింగ్. రైజింగ్ స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి, 'తండేల్' టీమ్‌కు, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసుకు కృతజ్ఞతలు" అని ఆయన పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు చైతన్యతో గతంలో దిగిన ప్రత్యేకమైన ఫోటో, 'తండేల్' పోస్టర్‌ను నాగార్జున జత చేశారు. 
akkineni nagarjuna
thandel
Naga Chaitanya
Movie News

More Telugu News