Vijay Pal: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో విజయ్ పాల్ కు బెయిల్

Vijay Pal gets condtional bail in Raghurama Custodial Torture Case
  • రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు
  • ఏ4గా ఉన్న సీఐడీ రిటైర్డ్ అదనపు ఎస్పీ విజయ్ పాల్
  • గుంటూరు జైల్లో రిమాండ్ లో ఉన్న వైనం
  • షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ రిటైర్డ్ అదనపు ఎస్పీ విజయ్ పాల్ కు బెయిల్ లభించింది. విజయ్ పాల్ ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనను ఈ కేసు ఎఫ్ఐఆర్ లో ఏ4 నిందితుడిగా పేర్కొన్నారు. ఆయనకు గుంటూరు స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 

కాగా, ఈ ఉదయం గుంటూరు కోర్టుకు రఘురామకృష్ణరాజు వచ్చారు. కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించిన ఓ అంశంపై కోర్టులో స్టేట్ మెంట్ ఇచ్చారు.
Vijay Pal
Bail
Raghurama Custodial Torture Case

More Telugu News