Govt Jobs: భారత నౌకాదళంలో 270 పోస్టులు.. ఎస్ఎస్ సీ నోటిఫికేషన్

Indian Navy SSC Officer Recruitment 2025 Notification Released
  • ఇంటర్య్వూతో ఎంపిక.. ప్రారంభంలోనే రూ. లక్ష వేతనం
  • అకడమిక్ ప్రతిభ ఆధారంగా ఇంటర్వ్యూకు పిలుపు
  • పదో తరగతి నుంచి పీజీ దాకా.. పోస్టును బట్టి అర్హతలు
భారత నౌకాదళంలో వివిధ పోస్టుల భర్తీకి షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్ సీ) తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాలలో మొత్తం 270 పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఆయా పోస్టులను బట్టి పదో తరగతి నుంచి పీజీ పూర్తి చేసిన అవివాహిత స్త్రీ, పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదని, ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తామని పేర్కొంది. పదో తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీలలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్య్యూకు పిలవనున్నట్లు వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులను సబ్ లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటామని, వీరికి మొదటి నెల నుంచే రూ.లక్ష వేతనంగా చెల్లించనున్నట్లు తెలిపింది. 

ఎగ్జిక్యూటివ్‌, ఎడ్యుకేషన్‌, టెక్నికల్‌ బ్రాంచ్‌లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఎస్ఎస్ సీ పేర్కొంది. ఈ పోస్టుల ఎంపికకు అకడమిక్ ప్రతిభను కొలమానంగా చూస్తామని, యూజీ/పీజీలో ఎక్కువ మార్కులు పొందినవారిని ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తామని తెలిపింది. ఇంటర్వ్యూలో విజయం సాధించిన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి నియామకపు ఉత్తర్వులు అందజేయనున్నట్లు వివరించింది. ఎంపికైన అభ్యర్థులకు ఎజిమాళ నేవల్‌ అకాడెమీలో 22 వారాల పాటు శిక్షణ, ఆపై సంబంధిత విభాగాల్లో మరో 22 వారాలు శిక్షణ ఉంటుందని తెలిపింది.

శిక్షణ విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులను సబ్ లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటామని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థులు డీఏ, హెచ్ఆర్ఏ సహా ఇతరత్రా ప్రోత్సాహకాలు కలుపుకుని మొదటి నెల రూ.1.10 లక్షల వేతనం అందుకుంటారని చెప్పింది. సంబంధిత డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్ సీసీ అభ్యర్థులకు అకడమిక్ మార్కుల్లో 5 శాతం సడలింపు వర్తిస్తుంది. బెంగళూరు, భోపాల్, విశాఖపట్నం, కోల్ కతాలోని ఎస్‌ఎస్‌బీ ఆఫీసులలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. పూర్తి వివరాలకు https://www.joinindiannavy.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.


ఖాళీలు, అర్హతలు:
ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌: 60
అర్హత: ఏదైనా బ్రాంచీలో బీఈ/బీటెక్‌లో 60% మార్కులతో ఉత్తీర్ణత.

ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌: 15
అర్హత: బీఈ/బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ

టెక్నికల్‌ బ్రాంచ్‌: 101
ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో 60% మార్కులతో బీఈ/బీటెక్‌ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు

వయసు: జనవరి 2, 2001/2002 - జనవరి 1, 2005/2006/2007 మధ్య జన్మించి ఉండాలి (పోస్టును బట్టి మారుతుంది)
నవారు ఫిబ్రవరి 25 లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Govt Jobs
Job Notifications
SSC
Indian Navy

More Telugu News