Alla Nani: తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ మంత్రి ఆళ్ల నాని

Alla Nani joins Telugudesam
  • ఉండవల్లిలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఆళ్ల నాని
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు
  • కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇతర నాయకులు
మాజీ మంత్రి ఆళ్ల నాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లికి వెళ్లిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు.

చంద్రబాబునాయుడు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మంత్రి పార్థసారథి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, సుజయ్ కృష్ణ రంగారావు తదితరులు పాల్గొన్నారు.
Alla Nani
Telugudesam
YSRCP
Andhra Pradesh

More Telugu News