Max On ZEE5: ZEE5లో ఫిబ్రవరి 15 నుంచి స్ట్రీమింగ్ కానున్న కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’

Kiccha Sudeep starred Max movie streaming on ZEE5 from Feb 15
  • కిచ్చా సుదీప్ లీడ్ రోల్ లో 'మ్యాక్స్'
  • పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటించిన కిచ్చా సుదీప్
  • 2024లో కన్నడ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం
  • 'మ్యాక్స్' చిత్రం డిజిటల్ ప్రీమియర్ ప్రకటన చేసిన జీ5
గతేడాది కన్నడలో అత్యధిక గ్రాసర్‌గా నిలిచిన చిత్రం 'మ్యాక్స్'. స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ ప్రకటన వెలువడింది. ZEE5  ఓటీటీ వేదికలో ఫిబ్రబరి 15 నుంచి కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మాస్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్ అయిన ‘మ్యాక్స్’ డిజిటల్ ప్రీమియర్‌ను ZEE5 తాజాగా ప్రకటించింది.

‘మ్యాక్స్’ మూవీ ఫిబ్రవరి 15న రాత్రి 7:30 గంటలకు జీ5లో స్ట్రీమింగ్ కానుంది. నూతన దర్శకుడు విజయ్ కార్తికేయ డైరెక్షన్‌లో వచ్చిన ఈ హై ఆక్టేన్, హార్ట్ రేసింగ్ రోలర్‌కోస్టర్ మూవీకి థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్ అవతార్‌లో కిచ్చా సుదీప్ చాలా కొత్తగా కనిపించారు. కన్నడ బాక్సాఫీస్ వద్ద మ్యాక్స్ రికార్డులు సృష్టించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళంలోనూ మంచి ఆదరణను దక్కించుకుంది. 

కిచ్చా సుదీప్‌తో పాటు ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, సంయుక్త హోర్నాడ్, సుకృతా వాగ్లే, సునీల్, అనిరుధ్ భట్ తదితరులు నటించారు.  కలైపులి ఎస్. థాను (వి క్రియేషన్స్), కిచ్చా సుదీప్ (కిచ్చా క్రియేషన్స్) నిర్మించిన ఈ థ్రిల్లింగ్ చిత్రం ఇప్పటికే 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రంగా నిలిచింది.

పోలీసు ఇన్‌స్పెక్టర్ అర్జున్ మహాక్షయ్ (కిచ్చా సుదీప్)గా 'మ్యాక్స్‌'లో కిచ్చా సుదీప్ అదరగొట్టేశారు. గ్యాంగ్ స్టర్‌లను పరుగులు పెట్టించే నిజాయతీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కిచ్చా సుదీప్ మెప్పించారు. ఒక్క రాత్రిలో జరిగే ఘటనలను ఎంతో గ్రిప్పింగ్‌గా చూపించి ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు. 

జీ5లో 'మ్యాక్స్' డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న సందర్భంగా కిచ్చా సుదీప్ మాట్లాడుతూ... "మ్యాక్స్‌ మూవీ ZEE5లో స్ట్రీమింగ్ అవుతుండడం నాకు ఆనందంగా ఉంది. ముఖ్యంగా థియేటర్లలో విడుదలైన క్షణం నుంచి అభిమానులు, ఆడియెన్స్‌ను నుంచి ప్రేమ లభిస్తూనే వచ్చింది. పోలీస్ ఇన్‌స్పెక్టర్ అర్జున్ మహాక్షయ్ పాత్రలో నటించడం గొప్ప అనుభవం. యాక్షన్, ఎమోషన్, ఇంటెన్స్ డ్రామాతో నిండిన ఈ మూవీని ఇప్పుడు జీ5లో అందరూ చూడబోతోన్నారు. మాక్స్ డిజిటల్‌గా ప్రీమియర్‌లను ప్రదర్శిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మరింత ఎక్కువ మందికి చేరుతుందని ఆశిస్తున్నాను" అని అన్నారు.
Max On ZEE5
Kiccha Sudeep
ZEE5
Streaming
OTT

More Telugu News