Krishnaveni: అలనాటి సినీ నటి, నిర్మాత కృష్ణవేణి మృతిపై మాజీ సీఎం జగన్ స్పందన

Jagan responds on former actress and producer Krishnaveni demise
  • నటి, నిర్మాత కృష్ణవేణి కన్నుమూత
  • సంతాపం వ్యక్తం చేసిన జగన్
  • సినీ రంగానికి తీరని లోటు అని వెల్లడి 
అలనాటి సినీ నటి, నిర్మాత, నేపథ్య గాయని కృష్ణవేణి కన్నుమూయడంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ స్పందించారు. నటిగా, నిర్మాతగా, గాయనిగా ఖ్యాతి పొంది, ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్న కృష్ణవేణి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నట్టు జగన్ వెల్లడించారు. 

"కృష్ణవేణి అనేక భాషల్లో నటించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందారు. నటిగా తనదైన ముద్రవేసిన ఆమె మృతి సినీ రంగానికి తీరని లోటు. అనేక గొప్ప చిత్రాలు నిర్మించి నిండు నూరేళ్లు సంపూర్ణంగా జీవించి పరమపదించిన ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అంటూ జగన్ పేర్కొన్నారు.
Krishnaveni
Demise
Jagan
YSRCP

More Telugu News