Virat Kohli: బీసీసీఐ రూల్స్‌‌... నో పర్సనల్ చెఫ్‌... దుబాయ్‌లో డైట్‌ ఫుడ్‌ కోసం కోహ్లీ ఏం చేశాడో తెలిస్తే..!

Personal Chef Banned But Virat Kohli Finds Unique Way To Get Desired Food In Dubai
  • చాంపియ‌న్స్ ట్రోఫీ కోసం దుబాయ్ లో దిగిన భార‌త జ‌ట్టు 
  • ఇప్ప‌టికే టీమిండియా ఆట‌గాళ్లు ముమ్మ‌రంగా ప్రాక్టీస్ 
  • విదేశీ పర్యటనలకు ప్లేయ‌ర్లు తమ సొంత చెఫ్‌లు తీసుకువెళ్ల‌డంపై బీసీసీఐ నిషేధం
  • ఈ క్ర‌మంలో త‌న‌కు కావాల్సిన ఫుడ్ ను స‌రికొత్త మార్గంలో తెప్పించుకున్న కోహ్లీ
ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లో భార‌త జట్టు ఆశించిన స్థాయిలో రాణించ‌లేదు. దాంతో 3-1 తేడాతో ట్రోఫీని చేజార్చుకుంది. ఇక ఈ ట్రోఫీ ముగిసిన తర్వాత భారత క్రికెట్ లో చాలా మార్పులు వచ్చాయి. బీసీసీఐ... జట్టులో కొన్ని కార్యకలాపాలను పరిమితం చేస్తూ 10 పాయింట్ల ఆదేశాన్ని జారీ చేసింది. విదేశీ పర్యటనలకు ఆటగాళ్లు తమ సొంత చెఫ్‌లు, స్టైలిస్టులు, సిబ్బందిని తీసుకువెళ్ల‌డాన్ని నిషేధించింది. 

ఇక తాజాగా ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీ కోసం భార‌త జ‌ట్టు దుబాయ్ లో అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే  భార‌త ఆట‌గాళ్లు ప్రాక్టీస్ కూడా ముమ్మ‌రం చేశారు. అయితే, బీసీసీఐ నిబంధ‌న ప్ర‌కారం వ్య‌క్తిగ‌త చెఫ్ ల‌ను తీసుకెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. జ‌ట్టు మొత్తానికి ఒక చెఫ్ ను బీసీసీఐ ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో డైట్ విష‌యంలో క‌ఠినంగా ఉండే స్టార్ ప్లేయ‌ర్‌ విరాట్ కోహ్లీ తనకు కావలసిన రుచికరమైన ఆహారం కోసం ఒక ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొన్నాడని స‌మాచారం.

ఆదివారం ప్రాక్టీస్ కు వ‌చ్చిన కాసేప‌టికే వేదిక వ‌ద్ద‌కు ర‌న్ మెషీన్ కి ఫుడ్ డెలివ‌రీ అయింది. ప్యాకెట్ల రూపంలో ఉన్న‌వి అత‌నికి అందాయి. త‌న‌కు ప్ర‌త్యేకంగా చెఫ్ లేక‌పోవ‌డంతో లోక‌ల్ టీమ్ మేనేజ‌ర్ కు చెప్పి త‌న‌కు కావాల్సిన వాటిని తెప్పించుకున్నాడు. ఎలా ఉండాలి ఎలా చేయాలి అనే దాని గురించి మేనేజ‌ర్ కు పూర్తిగా వివ‌రించిన‌ట్లు తెలుస్తోంది. కోహ్లీ వివ‌ర‌ణ ప్ర‌కారం స‌ద‌రు మేనేజ‌ర్ వెంట‌నే ప్ర‌సిద్ధిగాంచిన ఫుడ్ పాయింట్ నుంచి ప్యాకెట్ల‌ను తెచ్చి స్టార్ బ్యాట‌ర్‌కు ఇచ్చాడు.    

"ప్రాక్టీస్ సెష‌న్ అనంత‌రం కోహ్లీకి తిన‌డానికి కొన్ని ఆహార పొట్లాల‌ను ఇచ్చారు. ఇత‌ర క్రికెట‌ర్లు త‌మ కిట్ ల‌ను స‌ర్దుకుంటూ ఉండ‌గానే.. విరాట్ మాత్రం అక్క‌డే త‌న భోజ‌నం ముగించాడు. బస్సులోనూ తినేందుకు కొన్ని పొట్లాల‌ను దాచుకున్నాడు" అని క్రికెట్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. 

ఇదిలాఉంటే.. మ‌రో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భార‌త్ త‌న మొద‌టి మ్యాచ్ ను ఈ నెల 20న బంగ్లాదేశ్ తో ఆడ‌నుంది. ఆ త‌ర్వాత 23న పాక్ తో, మార్చి 2న న్యూజిలాండ్ తో త‌ల‌ప‌డ‌నుంది.  
Virat Kohli
Dubai
Champions Trophy 2025
Personal Chef
Team India
Cricket
Sports News

More Telugu News