Delhi CM: ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణం స్వీకారం చేసేది ఎప్పుడంటే...!

- గురువారం సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీ సీఎం ప్రమాణం
- మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రుల సమక్షంలో రామ్‌లీలా మైదానంలో వేడుక
- మంత్రివర్గమూ అదే రోజు ప్రమాణం చేస్తుందని వార్తలు
- ఢిల్లీ సీఎం రేసులో ముందు వరుసలో ఉన్న పర్వేశ్ వర్మ, రేఖా గుప్తా, ఆశీష్ సూద్
ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారైనట్టు తెలిసింది. గురువారం సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రుల సమక్షంలో రామ్‌లీలా మైదానంలో ఈ వేడుక జరగనుందని సమాచారం. మంత్రివర్గమూ అదే రోజు ప్రమాణం చేస్తుందని వార్తలు వస్తున్నాయి.
ఢిల్లీ సీఎం రేసులో పర్వేశ్ వర్మ, రేఖా గుప్తా, ఆశీష్ సూద్ ముందు వరుసలో ఉన్నారు. ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాషాయ పార్టీ ఏకంగా 48 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. అటు అధికార ఆప్ కేవలం 22 సీట్లకే పరిమితమైంది. దాంతో 27 ఏళ్ల తర్వాత బీజేపీ పార్టీ ఢిల్లీలో తిరిగి అధికారం చేపట్టబోతోంది.