Hyderabad: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఖరీదైన కార్లతో స్టంట్... అరెస్ట్ చేసిన పోలీసులు

Students in Fortuner and BMW Perform Stunts on Outer Ring Road Near Shamshabad Arrested
  • టయోటా ఫార్చ్యూనర్, బీఎండబ్ల్యూ కార్లతో రింగ్ రోడ్డుపై స్టంట్
  • నిందితుల అరెస్ట్  
  • లగ్జరీ కార్లను సీజ్ చేసిన పోలీసులు
హైదరాబాద్‌లో రెండు లగ్జరీ ఎస్‌యూవీ కార్లతో ప్రమాదకర స్టంట్ చేసిన నిందితులను రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. లగ్జరీ కార్లతో స్టంట్ చేసిన యువకులను అబ్దుల్లా, సిద్ధిక్‌గా గుర్తించారు. వారిని పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. స్టంట్ చేసిన రెండు లగ్జరీ కార్లను పోలీసులు సీజ్ చేశారు.

ఫిబ్రవరి 9వ తేదీన ఔటర్ రింగు రోడ్డులోని ఐదు వరుసల రహదారిపై టయోటా ఫార్చ్యూనర్, బీఎండబ్ల్యూ కార్లతో విన్యాసాలు చేసినట్లు సీసీ కెమెరా ఫుటేజీ రికార్డు అయింది. ఆ కార్లను ఒకేచోట సర్కిల్‌గా తిప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. ఈ విన్యాసాలపై రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. వారిని ఈ రోజు అరెస్ట్ చేశారు.
Hyderabad
Outer Ring Road
Telangana
Police

More Telugu News