Bowling Coach Morne Morkel: స్వదేశానికి వెళ్లిపోయిన టీమిండియా బౌలింగ్ కోచ్.... ఎందుకంటే..!

indias bowling coach morne morkel had to return home due to the death of his father
  • ఛాంపియన్ ట్రోఫీ ముందు భారత్ కు బిగ్ షాక్
  • దుబాయ్ నుంచి స్వదేశానికి పయనమైన టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ 
  • తండ్రి మృతితో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లిన బౌలింగ్ కోచ్
ఛాంపియన్ ట్రోఫీకి ముందు భారత్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ స్వదేశానికి వెళ్లిపోయారు. దుబాయ్ నుంచి ఆయన దక్షిణాఫ్రికాకు పయనమయ్యారు. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో భారత్ తొలి మ్యాచ్ జరగనుండగా, సోమవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు బౌలింగ్ కోచ్ మోర్కెల్ హాజరు కాలేదు.

ఆయన స్వదేశానికి వెళ్లడంతో తిరిగి ఎప్పుడు జట్టుతో కలుస్తారనే దానిపై స్పష్టత లేదు. ఆయన తండ్రి మృతి చెందడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మోర్కెల్ వెళ్లినట్లు తెలుస్తోంది. బౌలింగ్ కోచ్ లేకపోవడంతో ఛాంపియన్ ట్రోఫీలో భారత్ జట్టుపై ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు.

ఛాంపియన్ ట్రోఫీ కోసం మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. భారత్ తన మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుండగా, మిగతా జట్లు పాక్ వేదికల్లో పోటీ పడనున్నాయి. 2017లో ఛాంపియన్ ట్రోఫీని పాకిస్థాన్ గెలుచుకుంది. 
Bowling Coach Morne Morkel
Sports News
Cricket

More Telugu News