Shubman Gill: ఐసీసీ ర్యాంకింగ్స్ లో ర‌ప్ఫాడించిన గిల్‌... బాబ‌ర్‌ను వెన‌క్కి నెట్టి అగ్ర‌స్థానం కైవ‌సం!

Shubman Gill Dethrones Babar Azam To Become No 1 Batter In Latest ODI Rankings
  • 796 రేటింగ్ పాయింట్ల‌తో నంబ‌ర్‌ వన్ ర్యాంకు ద‌క్కించుకున్న గిల్ 
  • 773 రేటింగ్‌ పాయింట్ల‌తో రెండో స్థానానికి ప‌డిపోయిన బాబ‌ర్ 
  • గిల్ తో పాటు టాప్-10లో మ‌రో ముగ్గురు భార‌త ఆట‌గాళ్లకు చోటు
తాజాగా విడుద‌ల చేసిన ఐసీసీ వ‌న్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్ లో టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ శుభ్‌మ‌న్ గిల్ అగ్ర‌స్థానం ద‌క్కించుకున్నాడు. ఇటీవ‌ల స్వ‌దేశంలో ఇంగ్లండ్ తో జ‌రిగిన మూడు వ‌న్డేల సిరీస్ లో ఈ యువ బ్యాట‌ర్ అద్భుతంగా రాణించిన విష‌యం తెలిసిందే. ఆ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న కార‌ణంగా... నంబ‌ర్‌ వన్ గా ఉన్న పాక్ స్టార్ ఆట‌గాడు బాబ‌ర్ ఆజాంను వెన‌క్కి నెట్టి గిల్ అగ్ర‌స్థానం కైవ‌సం చేసుకున్నాడు. 

796 రేటింగ్ పాయింట్ల‌తో గిల్ నంబ‌ర్‌ వన్ ర్యాంకు ద‌క్కించుకోగా... 773 రేటింగ్‌ పాయింట్ల‌తో బాబ‌ర్ రెండో స్థానానికి ప‌డిపోయాడు. గిల్ వన్డే క్రికెట్ లో నంబ‌ర్‌ వన్ ర్యాంకింగ్ ను ద‌క్కించుకోవడం ఇది రెండోసారి. అటు గిల్ త‌ర్వాత‌ టాప్-10లో ముగ్గురు భార‌త ఆట‌గాళ్లు చోటు ద‌క్కించుకున్నారు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (761) మూడో స్థానంలో నిలిచాడు. అలాగే విరాట్ కోహ్లీ (727) ఆరో ర్యాంకు ద‌క్కించుకోగా... శ్రేయస్ అయ్యర్ ఒక ర్యాంకు మెరుగుపరుచుకుని (679) తొమ్మిదో స్థానానికి ఎగ‌బాకాడు.  

కాగా, ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ లో గిల్ అద్భుతంగా ఆడాడు. నాగ్‌పూర్‌లో జరిగిన మొదటి మ్యాచ్ లో 96 బంతుల్లో 87 పరుగులు చేశాడు. కటక్ లోని బారాబతి స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో 52 బంతుల్లో 60 ర‌న్స్ బాదాడు. ఇక అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఆఖ‌రిదైన మూడో వ‌న్డేలో  గిల్ సెంచ‌రీ (112)తో అద‌ర‌గొట్టిన విష‌యం తెలిసిందే. అలాగే అయ్యర్ కూడా మూడు మ్యాచ్ లలో వరుసగా 59, 44, 78 పరుగులు చేసి సత్తా చాటాడు.  
Shubman Gill
Babar Azam
ODI Rankings
Team India
Cricket
Sports News

More Telugu News