Pakistan vs New Zealand: ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ ప్రారంభం... పాక్‌తో మ్యాచ్‌... కివీస్ బ్యాటింగ్‌

Pakistan vs New Zealand Champions Trophy 1st Match at Karachi
  • క‌రాచీ వేదిక‌గా పాక్‌, కివీస్ మ‌ధ్య తొలి మ్యాచ్‌
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌
  • ఆచితూచి ఆడుతున్న న్యూజిలాండ్‌
  • హాఫ్ సెంచ‌రీతో అద‌ర‌గొట్టిన విల్ యంగ్‌
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐసీసీ మెగా ఈవెంట్ ఛాంపియ‌న్స్ ట్రోఫీ ప్రారంభ‌మైంది. క‌రాచీ వేదిక‌గా తొలి మ్యాచ్ లో ఆతిథ్య పాకిస్థాన్, న్యూజిలాండ్ బ‌రిలోకి దిగాయి. మొద‌ట టాస్ గెలిచిన పాక్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ ఆచితూచి ఆడుతోంది. 

ఓపెన‌ర్ విల్ యంగ్ అర్ధ శ‌త‌కం చేసి ఆడుతున్నాడు. మ‌రో ఓపెన‌ర్ కాన్వే (10), కేన్ విలియ‌మ్స‌న్ (1) నిరాశ‌ప‌రిచారు. మిచెల్ కూడా 10 ర‌న్స్ కే వెనుదిరిగాడు. దీంతో న్యూజిలాండ్ 73 ప‌రుగుల‌కే కీల‌క‌మైన 3 వికెట్లు కోల్పోయింది. ప్ర‌స్తుతం క్రీజులో యంగ్ (72 బ్యాటింగ్) లాథ‌మ్ (14 బ్యాటింగ్) ఉండ‌గా... కివీస్ స్కోరు 110/3 (24 ఓవర్లు).  
Pakistan vs New Zealand
Champions Trophy 2025
Karachi
Cricket
Sports News

More Telugu News