Shahid Afridi: భారత్, పాక్ ఆటగాళ్లను 'కేఎఫ్ సీ జనరేషన్' అని పేర్కొన్న అఫ్రిది

shahid afridi slams stars for no aggression in india vs pakistan games ahead of ct 2025
  • దాయాదుల పోరుపై మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు
  • భారత్ – పాక్ మ్యాచ్ అంటే గతంలో కనిపించే దూకుడు ఇప్పుడు లేదన్న అఫ్రిది
  • నేటి తరం ఆటగాళ్లు అందరూ మెక్‌ డొనాల్డ్స్, కేఎఫ్‌సీ తరం వాళ్లు అంటూ వ్యాఖ్య
త్వరలో ఛాంపియన్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ టోర్నమెంట్‍కే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ నేపథ్యంలో, దాయాదుల పోరుపై మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ క్రీడా ఛానెల్‌లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే గతంలో కనిపించే దూకుడు ఇప్పుడు లేదని అఫ్రిది అభిప్రాయపడ్డారు. నేటి తరం ఆటగాళ్లంతా మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ తరం వాళ్లంటూ ఆయన వ్యాఖ్యానించారు.  

కాగా, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల తమ జట్టును ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని గెలవాలని ఆకాంక్షించారు. 1990ల నుంచి ఐసీసీ టోర్నీల్లో భారత్, పాక్ మధ్య క్రికెట్ వైరం కొనసాగుతోంది. 2021లో దుబాయ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చివరిసారిగా భారత్‌పై విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన కీలక టోర్నీల్లో మాత్రం పాకిస్థాన్ ఓటమి పాలైంది. 
Shahid Afridi
india vs pakistan games
Champions Trophy 2025
Cricket
Sports News

More Telugu News