Champions Trophy 2025: బంగ్లాదేశ్‌తో మ్యాచ్... అరుదైన ఐదు రికార్డుల ముంగిట రోహిత్!

- దుబాయ్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్
- బలాబలాలు, గత రికార్డులను పరిశీలిస్తే ఈ గేమ్ లో టీమిండియానే ఫేవరెట్
- ఈ మ్యాచ్ కి ముందు భారత కెప్టెన్ ను ఊరిస్తున్న ఐదు రికార్డులు
- మరో 12 పరుగులు చేస్తే.. 11వేల రన్స్ ఫీట్‌ను అందుకోనున్న రోహిత్
- ఈ ఫీట్ సాధిస్తే నాలుగో భారత ప్లేయర్‌గా, ప్రపంచంలోనే 10వ ఆటగాడిగా అవతరణ
- బంగ్లాపై సెంచరీ చేస్తే.. 50 లేదా అంతకంటే ఎక్కువ శతకాలు సాధించిన మూడో భారత ప్లేయర్‌గా రికార్డు
- అలాగే ప్రపంచంలోనే 10వ ఆటగాడిగా హిట్‌మ్యాన్ ఘనత
ఈరోజు దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ తో భారత జట్టు తన ఛాంపియన్స్ ట్రోఫీ పోరును ప్రారంభించనుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా.. ప్రత్యర్థి బంగ్లాతో పోలిస్తే అన్ని విభాగాల్లోనూ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. బలాబలాలు, గత రికార్డులను పరిశీలిస్తే ఈ మ్యాచ్ లో రోహిత్ సేననే ఫేవరెట్‌గా కనిపిస్తోంది.
అయినా బంగ్లా టైగర్స్ ను తక్కువ అంచనా వేయడానికి లేదని మాజీలు అభిప్రాయపడుతున్నారు. భారత జట్టు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అందుకే టీమిండియా తనదైన ఆటతోనే విరుచుకుపడాలని సూచిస్తున్నారు.
ఇక ఈ మ్యాచ్ కి ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఇవాళ్టి మ్యాచ్ లో హిట్‌మ్యాన్ అరుదైన ఐదు రికార్డులను అందుకునే అవకాశం ఉంది. అవెంటో ఇప్పుడు ఓ లుక్కేద్దాం.
రోహిత్ శర్మ 2007 జూన్ 23న బెల్‌ఫాస్ట్ లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా భారత్ తరపున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 268 మ్యాచ్ లు ఆడిన అతడు 10,988 పరుగులు చేశాడు. ఈరోజు మ్యాచ్ లో 12 పరుగులు చేస్తే, 50 ఓవర్ల ఫార్మాట్‌లో 11 వేల పరుగులు చేసిన నాలుగో భారత ప్లేయర్‌గా, ప్రపంచంలోనే 10వ ఆటగాడిగా అవతరిస్తాడు.
వన్డేల్లో 11వేలకు పైగా పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
సచిన్ టెండూల్కర్ (భారత్)- 18,426
కుమార్ సంగక్కర (శ్రీలంక)- 14,234
విరాట్ కోహ్లీ (భారత్)- 13,963
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)-13,704
సనత్ జయసూర్య (శ్రీలంక)- 13,430
మహేల జయవర్ధనే (శ్రీలంక)- 12,650
ఇంజమామ్-ఉల్-హక్ (పాకిస్థాన్)- 11,739
జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా)- 11,579
సౌరవ్ గంగూలీ (భారత్)- 11,363
ఇక హిట్‌మ్యాన్ మరో 12 రన్స్ చేసి, 11వేల పరుగుల మార్క్‌ను అందుకుంటే అతని ఖాతాలో మరో అరుదైన రికార్డు కూడా చేరుతుంది. విరాట్ కోహ్లీ తర్వాత ప్రపంచంలోనే అత్యంత వేగంగా 11వేల వన్డే పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా రికార్డుకెక్కుతాడు. రన్ మెషీన్ 222 ఇన్నింగ్స్ లలో ఈ మైలురాయిని అందుకుని అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు 260 ఇన్నింగ్స్ లు ఆడిన రోహిత్ 10,988 పరుగులు చేశాడు.
వన్డేల్లో అత్యంత వేగంగా 11,000 పరుగులు (ఇన్నింగ్స్ పరంగా)
విరాట్ కోహ్లీ (భారత్)- 222
సచిన్ టెండూల్కర్ (భారత్)- 276
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 286
సౌరవ్ గంగూలీ (భారత్)- 288
జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా)- 293
అలాగే ఈ మ్యాచ్ లో రోహిత్ శతకం బాదితే... రెండు ప్రపంచకప్ లు, ఛాంపియన్స్ ట్రోఫీ సీజన్లలో బంగ్లాపై సెంచరీ నమోదు చేసిన తొలి ఆటగాడిగా అవతరిస్తాడు. 2015 వన్డే ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్ లో మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్ లో రోహిత్ 126 బంతుల్లో 137 పరుగులు, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ లో 129 బంతుల్లో 123 నాటౌట్, ఎడ్జ్‌బాస్టన్ లో జరిగిన వన్డే ప్రపంచ కప్ 2019 లీగ్ దశ మ్యాచ్ లో 92 బంతుల్లో 104 పరుగులు చేశాడు.
ఈరోజు మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై సెంచరీ సాధిస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో 50 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు సాధించిన మూడో భారతీయ ఆటగాడిగా, ప్రపంచంలోనే 10వ ప్లేయర్ గా హిట్‌మ్యాన్ మరో ఘనత నమోదు సాధిస్తాడు. ఇప్పటివరకు ఈ జాబితాలో వంద సెంచరీలతో మాస్టర్ బ్లాస్టర్ అగ్రస్థానంలో ఉంటే.. 81 శతకాలతో కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం రోహిత్ పేరిట 49 సెంచరీలు ఉన్నాయి.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు..
సచిన్ టెండూల్కర్ (భారత్)- 100
విరాట్ కోహ్లీ (భారత్)- 81
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 71
కుమార్ సంగక్కర (శ్రీలంక)- 63
జాక్వెస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా)- 62
హషీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా)- 55
మహేల జయవర్ధనే (శ్రీలంక)- 54
బ్రియాన్ లారా (వెస్టిండీస్)- 53
జో రూట్ (ఇంగ్లాండ్)- 52
రోహిత్ శర్మ (భారత్)- 49
దుబాయ్ లో ఇవాళ్టి మ్యాచ్ లో బంగ్లాను టీమిండియా ఓడిస్తే.. కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట మరో అరుదైన రికార్డు నమోదవుతుంది. భారత మాజీ కెప్టెన్లు మహ్మద్ అజారుద్దీన్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ తర్వాత 100 అంతర్జాతీయ మ్యాచ్ లను గెలిచిన నాలుగో భారత సారథిగా రోహిత్ నిలుస్తాడు. రోహిత్ నాయకత్వంలో భారత్ ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 137 మ్యాచ్ లలో ఆడి 99 విజయాలు సాధించింది.
భారత కెప్టెన్‌గా అత్యధిక విజయాలు సాధించింది వీరే..
ఎంఎస్ ధోనీ- 179
విరాట్ కోహ్లీ- 137
మొహమ్మద్ అజారుద్దీన్- 104
రోహిత్ శర్మ- 99
సౌరవ్ గంగూలీ- 97
ఇక ఈరోజు మ్యాచ్ లో హిట్‌మ్యాన్ 14 సిక్సర్లు కొడితే వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా అగ్రస్థానంలో నిలుస్తాడు. ప్రస్తుతం ఈ జాబితాలో 351 సిక్సర్ల (398 మ్యాచ్‌ల్లో)తో షాహిద్ అఫ్రిదీ మొదటి స్థానంలో ఉన్నాడు. అలాగే రోహిత్ ఇప్పటివరకు ఆడిన 268 మ్యాచ్‌ల్లో 338 సిక్సర్లు బాదాడు.