Champions Trophy 2025: విజృంభిస్తున్న టీమిండియా బౌలర్లు... బంగ్లా 35 పరుగులకే 5 వికెట్లు

- దుబాయ్ వేదికగా భారత్, బంగ్లా మ్యాచ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగిన బంగ్లాదేశ్
- నిప్పులు చెరుగుతున్న టీమిండియా బౌలర్లు
- ముగ్గురు బ్యాటర్లు డకౌట్
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్‌లో జరుగుతున్న రెండో మ్యాచ్ లో బంగ్లాదేశ్ బ్యాటర్లకు భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగిన బంగ్లా తొలి రెండు ఓవర్లలోనే రెండు వికెట్లు పారేసుకుంది. అది కూడా రెండు పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.
మొదటి ఓవర్ లో షమీ ఒక వికెట్ తీస్తే.. రెండో ఓవర్ లో హర్షిత్ రాణా రెండో వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత బంగ్లా బ్యాటర్లు కాసేపు కుదురుకున్నట్లు కనిపించారు. కానీ, మరోసారి షమీ.. మెహదీ హసన్ మీరాజ్‌ను పెవిలియన్ కి పంపి మూడో వికెట్ తీశాడు.
అనంతరం బౌలింగ్ కి దిగిన అక్షర్ పటేల్ తన తొలి ఓవర్ లోనే రెండు వికెట్లు తీసి, బంగ్లా టైగర్స్ ను పీకలోతు కష్టాల్లోకి నెట్టేశాడు. దీంతో ప్రత్యర్థి జట్టు 35 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో సౌమ్య సర్కార్, కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో, ముష్ఫికర్ రహీమ్ డకౌట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో తౌహిద్ హృదయ్ (10 బ్యాటింగ్), జాకర్ అలీ (6 బ్యాటింగ్) ఉండగా... బంగ్లాదేశ్ స్కోరు 49/5 (12 ఓవర్లు).