Team India: టాస్ ఓడటంలోనూ టీమిండియా రికార్డు

India Equal Dismal Record even before a Ball in Champions Trophy 2025
  • వ‌న్డేల్లో వ‌రుస‌గా అత్య‌ధిక మ్యాచ్‌ల‌లో (11) టాస్ ఓడిన జ‌ట్టుగా భార‌త్
  • నెద‌ర్లాండ్స్ పేరిట ఉన్న రికార్డును స‌మం చేసిన టీమిండియా
  • 2023 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు వ‌రుస‌గా 11 సార్లు టాస్ ఓడిన వైనం
వ‌న్డేల్లో వ‌రుస‌గా అత్య‌ధిక మ్యాచ్‌ల‌లో(11) టాస్ ఓడిన జ‌ట్టుగా నెద‌ర్లాండ్స్ పేరిట ఉన్న రికార్డును భార‌త్ స‌మం చేసింది. ఛాంపియ‌న్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో టాస్ ఓడ‌టంతో ఈ రికార్డును న‌మోదు చేసింది. మార్చి 2011 నుంచి ఆగ‌స్టు 2013 మ‌ధ్య నెద‌ర్లాండ్స్ వ‌రుస‌గా 11 మ్యాచ్ ల్లో టాస్ ఓడింది. 

భార‌త జ‌ట్టు కూడా 2023 న‌వంబ‌ర్ 19న జ‌రిగిన‌ వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 11 సార్లు టాస్ గెల‌వ‌లేక‌పోయింది. ఇదే ఏడాది డిసెంబ‌ర్ లో ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మూడు వ‌న్డేల్లోనూ టీమిండియా టాస్ ఓడిపోయింది. ఆ త‌ర్వాత 2024 ఆగ‌స్టులో శ్రీలంక‌తో ఆడిన మూడు వ‌న్డేల సిరీస్ లోనూ భార‌త్ ది అదే ప‌రిస్థితి. 

ఇటీవ‌ల స్వ‌దేశంలో ఇంగ్లండ్ తో జ‌రిగిన మూడు వ‌న్డేల్లోనూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ టాస్ ఓడిపోయాడు. ఈరోజు మ్యాచ్ లోనూ భార‌త్ టాస్ గెల‌వ‌లేక‌పోయింది. ఇలా 2023 న‌వంబ‌ర్ 19 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు వ‌రుస‌గా 11 సార్లు టాస్ ఓడి, నెద‌ర్లాండ్స్ రికార్డును స‌మం చేసింది. మ‌రో మ్యాచ్ లో టాస్ ఓడితే.. భార‌త్ పేరిట అత్య‌ధిక‌సార్లు టాస్ ఓడిన‌ చెత్త రికార్డు న‌మోదు అవుతుంది. 
Team India
Champions Trophy 2025
Cricket
Sports News

More Telugu News