Raja Singh: రాహుల్ గాంధీ ఫిర్యాదు ఆధారంగా నా ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఖాతాలను తొలగించారు: రాజాసింగ్ ఆగ్రహం

Raja Singh alleges targeted SM censorship Telangana
  • రెండు ఫేస్‌బుక్, మూడు ఇన్‌స్టా ఖాతాలను తొలగించిన మెటా
  • హిందువులను లక్ష్యంగా చేసుకొని సెలక్టివ్ సెన్సార్‌షిప్ జరుగుతోందని ఆగ్రహం
  • తన ఖాతాలను తొలగించడం దురదృష్టకరమన్న రాజాసింగ్
లోక్ సభలో ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఫిర్యాదు ఆధారంగా తన అధికారిక ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను తొలగించారని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని సెలెక్టివ్ సెన్సార్‌షిప్ జరుగుతోందని ఆయన ఆరోపించారు.

గురువారం తన కుటుంబం, స్నేహితులు, కార్యకర్తలు, మద్దతుదారుల సోషల్ మీడియా ఖాతాలను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్ చేసిందని, ఇది దురదృష్టకరమని అసహనం వ్యక్తం చేశారు. తన ఖాతాలను తొలగించడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు చెందిన రెండు ఫేస్‌బుక్ ఖాతాలు, మూడు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను మెటా సంస్థ తొలగించింది. దీనిపై రాజాసింగ్ స్పందించారు.
Raja Singh
Telangana
BJP
Facebook
Instagram

More Telugu News