Revanth Reddy: కిషన్ రెడ్డి, బండి సంజయ్ చర్చకు సిద్ధమా... ఏ సెంటరైనా వస్తాం: రేవంత్ రెడ్డి సవాల్

Revanth Reddy challenges Bandi Sanjay and Kishan Reddy
  • మోదీ 12 ఏళ్ల పాలన, మా 12 నెలల పాలనపై చర్చకు సిద్ధమా? అన్న ముఖ్యమంత్రి
  • రూ.15 లక్షలు పంచుతామన్న మోదీ ఒక్కరికైనా ఇచ్చారా అని నిలదీత
  • పన్నెండేళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు వచ్చాయా అని ప్రశ్న
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన, తెలంగాణలో కాంగ్రెస్ 12 నెలల పాలనపై కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చర్చకు సిద్ధమా? అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సవాల్ చేశారు. ఏ సెంటర్ అయినా, ఎప్పుడైనా, తాను, దామోదర రాజనర్సింహ వస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో, లోక్ సభ ఎన్నికల సమయంలో మోదీ ఇచ్చిన హామీలపై చర్చించుదామని ఆయన అన్నారు. 

అధికారంలోకి వస్తే విదేశాల్లోని నల్లధనం తీసుకొచ్చి దేశంలోని పేదలకు పంచుతానని నరేంద్ర మోదీ అధికారంలోకి రాకముందు చెప్పారని, కానీ ఇప్పటి వరకు ఒక్కరి ఖాతాలలో అయినా వేశారా అని నిలదీశారు. పైగా నల్లధనం ఉన్నవారు మన దేశం విడిచి వెళ్లిపోయారని అన్నారు. విదేశాల్లోని నల్లధనం తెచ్చింది లేదు... పేదలకు ఇచ్చింది లేదని విమర్శించారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ చెప్పారని, ఈ పన్నెండేళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు వచ్చాయా? అని ప్రశ్నించారు.

మోదీ, బీజేపీ ఇచ్చిన హామీలపై చర్చకు ప్రధాన మంత్రి బంట్రోతులు వస్తారా లేక ఆయనే లెక్క చెబుతారా? అని నిలదీశారు. తెలంగాణలో కేసీఆర్ ఒక రకంగా మోసం చేస్తే, ప్రధాని నరేంద్ర మోదీ మరో రకంగా చేశారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. కొడంగల్‌లో ప్రాజెక్టులు తెచ్చి నిరుద్యోగ సమస్యను పరిష్కరించుకుందామని అన్నారు.
Revanth Reddy
Congress
G. Kishan Reddy
Bandi Sanjay
Narendra Modi

More Telugu News