Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ: రికెల్టన్ సెంచరీ... దక్షిణాఫ్రికా భారీ స్కోరు

- ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు దక్షిణాఫ్రికా × ఆఫ్ఘనిస్థాన్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలు
- 50 ఓవర్లలో 6 వికెట్లకు 315 పరుగులు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 315 పరుగులు చేసింది.
ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ సెంచరీతో మెరిశాడు. రికెల్టన్ 106 బంతుల్లో 103 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. అతడి స్కోరులో 7 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. కెప్టెన్ టెంబా బవుమా (58), వాన్ డర్ డుసెన్ (52), ఐడెన్ మార్ క్రమ్ (52 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు.
ఆఫ్ఘన్ బౌలర్లలో మహ్మద్ నబీ 2, ఫరూఖీ 1, ఒమర్జాయ్ 1, నూర్ అహ్మద్ 1 వికెట్ తీశారు.