Dagadarti Airport: నెల్లూరు జిల్లాలో ఎయిర్ పోర్టు.... భూములు పరిశీలించిన టీడీపీ నేతలు

TDP leaders inspects lands intended to Dagadarti Airport
  • ఏపీలో కొత్తగా ఏడు విమానాశ్రయాల నిర్మాణం
  • నెల్లూరు జిల్లాలో దగదర్తి వద్ద ఎయిర్ పోర్టు
  • ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో కలిసి భూములు పరిశీలించి నేతలు
ఏపీలో కొత్తగా ఏడు విమానాశ్రయాలు నిర్మిస్తున్నామని, వాటిలో నెల్లూరు జిల్లా దగదర్తి ఎయిర్ పోర్టు కూడా ఉందని సీఎం చంద్రబాబు ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో దగదర్తి విమానాశ్రయం భూములను టీడీపీ నేతలు పరిశీలించారు. ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దగదర్తి విమానాశ్రయ ప్రాంతంలో పర్యటించారు. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో కలిసి భూములను పరిశీలించారు. 

ఈ సందర్భంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, 2027 నాటికి దగదర్తి విమానాశ్రయం పూర్తి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. భూములకు సంబంధించి రైతులకు పరిహారం చెల్లించే అంశంపై చర్చించామని వెల్లడించారు. 1,379 ఎకరాల్లో ఎయిర్ పోర్టు నిర్మించనున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు 669 ఎకరాల భూమి సేకరించడం జరిగిందని, మరో 710 ఎకాలు సేకరించాల్సి ఉందని వేమిరెడ్డి వివరించారు. 

దగదర్తి విమానాశ్రయం ద్వారా ప్యాసింజర్, సరుకు రవాణా సేవలకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో రెండు పోర్టులు ఉన్నందున ఎగుమతులు, దిగుమతులకు మరింత అనుకూలతలు ఉన్నాయని తెలిపారు. దగదర్తి ప్రాంతం పరిశ్రమల హబ్ గా అభివృద్ధి చెందుతుందని అన్నారు. 
Dagadarti Airport
TDP Leaders
Nellore District

More Telugu News