Akbar: ఢిల్లీలోని అక్బర్, హుమాయున్ రోడ్ల సూచిక బోర్డులపై నల్లరంగు

Signboards Of Akbar Humayun Road In Delhi Defaced By Chhaava Fans
  • సూచిక బోర్డులపై నల్ల రంగు పూసి శివాజీ చిత్రాన్ని అతికించిన గుర్తు తెలియని వ్యక్తులు
  • సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతున్న వీడియోలు
  • కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు
దేశ రాజధాని ఢిల్లీలోని అక్బర్, హుమాయున్ రోడ్ల సూచిక బోర్డులపై గుర్తు తెలియని వ్యక్తులు నల్లరంగు పూశారు. సూచిక బోర్డులపై రంగు పూసి ఛత్రపతి శివాజీ చిత్రాన్ని అతికించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతున్నాయి. సూచిక బోర్డులపై నల్లరంగు పూసిన ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సూచిక బోర్డులపై నల్లరంగు పూశారని పోలీసులు వెల్లడించారు. వాటిని కొందరు వీడియోలు తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేయడంతో పోలీసుల దృష్టికి వచ్చింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సూచిక బోర్డులను శుభ్రం చేశారు. నలుపు రంగు పూసిన వ్యక్తులను గుర్తించేందుకు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
Akbar
New Delhi

More Telugu News