Ben Duckett: ఛాంపియన్స్ ట్రోఫీ: బెన్ డకెట్ భారీ సెంచరీ... ఆసీస్ ముందు దిమ్మదిరిగే టార్గెట్

Ben Duckett massive century guides England to set Australia huge target
  • ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు ఆస్ట్రేలియా × ఇంగ్లండ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్
  • 50 ఓవర్లలో 8 వికెట్లకు 351 పరుగులు చేసిన ఇంగ్లండ్
  • 143 బంతుల్లో 165 పరుగులు చేసిన డకెట్ 
  • 17 ఫోర్లు, 3 సిక్సులతో విధ్వంసం
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ (165) భారీ సెంచరీతో రాణించాడు. డకెట్ సెంచరీ సాయంతో ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 351 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్... ఇంగ్లండ్ కు బ్యాటింగ్ అప్పగించింది. 

మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ 10 పరుగుల వ్యక్తిగత స్కోరుకే వెనుదిరిగినప్పటికీ... డకెట్ దూకుడైన ఆటతీరుతో విరుచుకుపడ్డాడు. ఆసీస్ బౌలర్లను చితక్కొడుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ తర్వాత కూడా డకెట్ విధ్వంసం కొనసాగింది. డకెట్ మొత్తం 143 బంతులు ఎదుర్కొని 165 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 17 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి.

ఇంగ్లండ్ మిడిలార్డర్ లో జో రూట్ (68), కెప్టెన్ జోస్ బట్లర్ (23) పరుగులు చేశారు. చివర్లో జోఫ్రా ఆర్చర్ 10 బంతుల్లో 21 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ డ్వార్షూయిస్ 3, ఆడమ్ జంపా 2, లబుషేన్ 2, మ్యాక్స్ వెల్ 1 వికెట్ తీశారు.
Ben Duckett
England
Australia
Champions Trophy 2025

More Telugu News