India vs Pakistan: దుబాయ్‌లో దాయాదుల పోరు.. పిచ్‌, వెద‌ర్ రిపోర్ట్‌ ఇలా..!

Dubai Pitch And Weather Report For Champions Trophy 2025 Group A Clash
  • ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా ఈరోజు దుబాయ్‌లో దాయాదుల పోరు
  • ఓపెనింగ్ మ్యాచ్‌లోనే ఓట‌మితో డీలాప‌డ్డ‌ ఆతిథ్య పాకిస్థాన్‌
  • మొద‌టి మ్యాచ్‌లోనే విజ‌యంతో జోష్‌లో టీమిండియా 
  • ఈరోజు పిచ్ ప్రారంభంలో బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని అంచ‌నా
  • ఇవాళ దుబాయ్‌లో వర్షం పడే అవకాశం కేవలం 1 శాతం మాత్రమే
ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా ఈరోజు దుబాయ్ వేదిక‌గా చిరకాల ప్ర‌త్య‌ర్థులు భార‌త్‌, పాక్ త‌ల‌ప‌డ‌నున్నాయి. మ‌రికొన్ని గంట‌ల్లో దాయాదుల పోరు ప్రారంభం కానుంది. ఇక ఓపెనింగ్ మ్యాచ్‌లోనే ఓట‌మి పాలైన ఆతిథ్య పాకిస్థాన్‌కు ఈ గేమ్ చాలా కీల‌కం. ఇందులో ఓడితే పాక్ సెమీస్ అవ‌కాశాలు దాదాపు ముగిసిన‌ట్టే. అందుకే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెల‌వాల‌నే క‌సితో పాక్ బ‌రిలోకి దిగుతోంది. 

మ‌రోవైపు టీమిండియా తాను ఆడిన మొద‌టి మ్యాచ్‌లోనే విజ‌యంతో మంచి జోష్‌లో ఉంది. ఇక ఇరు జ‌ట్ల బ‌ల‌బలాల‌ను ప‌రిశీలిస్తే భార‌త్ కే ఫేవ‌రెట్ గా క‌నిపిస్తోంది. అయితే, పాక్‌ను త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి లేదు. ఆ జ‌ట్టు ఎప్పుడు ఎలా ఆడుతోంది చెప్ప‌లేం. 

నేటి మ్యాచ్‌కు దుబాయ్ పిచ్ ఇలా..
ఈరోజు పిచ్ ప్రారంభంలో బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని అంచ‌నా. సీమర్లు పోటీలో పెద్ద పాత్ర పోషించే అవకాశం ఉంది. ఆట కొసాగుతున్న కొద్దీ బ్యాటింగ్ సులభతరం అవుతుందని అంచ‌నా. ఇక 50 ఓవర్ల మ్యాచ్‌లో మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారు. అందువల్ల టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

ఈరోజు దుబాయ్ వాతావరణ రిపోర్ట్ ఇలా..
ఈరోజు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో వర్షం పడే అవకాశం కేవలం 1 శాతం మాత్రమే ఉంది. అంటే భారత్‌, పాక్‌ మధ్య పూర్తిగా 100 ఓవర్ల మ్యాచ్‌ జరుగుతుంది. మేఘావృతమైన ఆకాశం ఉంటుంద‌ని దుబాయ్ వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. 
India vs Pakistan
Dubai
Champions Trophy 2025
Cricket
Sports News

More Telugu News