Chandrababu: నా ఆత్మీయ నేస్తం ఎర్రన్నాయుడు: చంద్రబాబు

Errannaidu is my heartful friend says Chandrababu
  • నేడు ఎర్రన్నాయుడి జయంతి
  • నివాళి అర్పించిన చంద్రబాబు
  • మచ్చలేని చరిత్ర ఎర్రన్నాయుడి సొంతమని కితాబు
టీడీపీ దివంగత నేత ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందిస్తూ... ప్రజా సేవలో తిరుగులేని నిబద్ధత, నిజాయతీ, ఆత్మీయత కలబోసిన నాయకుడు ఎర్రన్నాయుడని కొనియాడారు. మూడు దశాబ్దాలకు మించిన రాజకీయ జీవితంలో మచ్చలేని చరిత్రను సొంతం చేసుకున్న తన ఆత్మీయ నేస్తం ఎర్రన్నాయుడని కొనియాడారు. ఎర్రన్నాయుడి జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుందామని అన్నారు. 

మరోవైపు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని ఎర్రన్నాయుడు ఘాట్‌ ను ఆయన తనయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు... ఆయన సోదరుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు సందర్శించారు. ఎర్రన్నాయుడి సమాధి వద్ద ఘన నివాళి అర్పించారు.
Chandrababu
Yerrannaidu
Telugudesam

More Telugu News