Tesla in AP: చంద్రబాబు కియా తెచ్చారు... లోకేశ్ టెస్లా తెస్తారు: మంత్రి సుభాష్

AP minister Vasamsetti Subhash says Lokesh will bring Tesla to AP
త్వరలో భారత్ లోకి టెస్లా ఎంట్రీ
ఉద్యోగులను నియమించుకుంటున్న ఈవీ కంపెనీ
కియా మనది... టెస్లా కూడా మనదే అంటూ వాసంశెట్టి సుభాష్ ట్వీట్
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన ప్రముఖ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ టెస్లా భారత్ లో రంగప్రవేశం చేయడం దాదాపు ఖాయమైంది. భారత్ లో తన కార్యకలాపాల కోసం ఉద్యోగులను నియమించుకుంటుండడంతో... టెస్లా రాకపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

అయితే, భారత్ లో తన ప్లాంట్ ను టెస్లా ఎక్కడ ఏర్పాటు చేస్తుందన్నది ఇంకా తేలలేదు. దాదాపు పెద్ద రాష్ట్రాలన్నీ టెస్లాపై ఆశలు పెట్టుకున్నాయి. ఇటు, టెస్లాను ఏపీకి తీసుకురావాలని చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కూడా భావిస్తోంది. టెస్లాకు కావాల్సిన అన్ని అనుకూలతలు ఏపీలో ఉన్నాయని నేతలు చెబుతున్నారు. 

ఈ క్రమంలో, ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. "చంద్రబాబు కియా తీసుకువచ్చారు... లోకేశ్ టెస్లా తెస్తారు. విజన్ ఉన్న వాళ్లు పాలకులుగా ఉంటే రాష్ట్రం మూడు పువ్వులు ఆరు కాయలుగా ముందుకుపోతుంది. కియా మనది... టెస్లా కూడా మనదే" అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
Tesla in AP
Vasamsetti Subhash
Nara Lokesh
Chandrababu
Andhra Pradesh

More Telugu News