Group-2 Mains: గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది: ఏపీపీఎస్సీ

APPSC statement on Group 2 Mains exam
  • నేడు ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష
  • పరీక్ష వాయిదా వేయాలంటూ కొన్ని రోజులుగా అభ్యర్థుల ఆందోళనలు
  • ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల వాయిదా వేయలేమని నిన్న ఏపీపీఎస్సీ స్పష్టీకరణ
ఏపీలో నేడు గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. రోస్టర్ విధానంలో మార్పులు చేయాలంటూ అభ్యర్థులు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేపడుతున్నప్పటికీ, ఏపీపీఎస్సీ ఈ పరీక్ష నిర్వహించింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ దశలో పరీక్ష వాయిదా వేయలేమని నిన్ననే స్పష్టం చేసింది. 

కాగా, నేడు పరీక్ష నిర్వహణపై ఏపీపీఎస్సీ స్పందించింది. రాష్ట్రంలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని వెల్లడించింది. మెయిన్స్ కు 92,250 మంది అర్హత సాధిస్తే... వారిలో 86,459 మంది హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపింది. హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్న వారిలో 92 శాతం మంది హాజరయ్యారని ఏపీపీఎస్సీ వివరించింది.
Group-2 Mains
APPSC
Andhra Pradesh

More Telugu News