USA: 1600 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన ట్రంప్ ప్రభుత్వం

Donald Trump Fires 1600 USAID Employees Others On Paid Leave
  • మరో 4600 మందిని పెయిడ్ లీవ్ పై పంపిన అమెరికా అధ్యక్షుడు
  • యూఎస్ఎయిడ్ సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిపై ట్రంప్ కొరడా
  • బాధ్యతలు చేపట్టిన వెంటనే యూఎస్ఎయిడ్ సాయాన్ని తాత్కాలికంగా ఆపేసిన వైనం
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే యూఎస్ఎయిడ్ (యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్) సాయాన్ని 90 రోజుల పాటు డొనాల్డ్ ట్రంప్ నిలిపివేశారు. ఈమేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. తాజాగా ఈ ఏజెన్సీకి చెందిన 1600 మంది ఉద్యోగులను ఆదివారం తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. యూఎస్ఎయిడ్ తరఫున విదేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను దీర్ఘకాలిక పెయిడ్ లీవ్ పై పంపించారు. ఆదివారం అర్ధరాత్రి ప్రాంతంలో ఈ వివరాలను యూఎస్ఎయిడ్ వెబ్ సైట్ ద్వారా వెల్లడించింది.

అత్యవసర సిబ్బంది మినహా యూఎస్ఎయిడ్ తరఫున విధులు నిర్వహిస్తున్న సిబ్బందంతా పెయిడ్ లీవ్ పై ఉన్నట్లు ప్రకటించింది. ఉద్యోగుల సంఖ్యను కుదించే క్రమంలో 1600 మందిని ఇంటికి పంపించినట్లు తెలిపింది. యూఎస్ఎయిడ్ ఉద్యోగులపై ట్రంప్ వేటు వేస్తారని ఊహాగానాలు వినిపించాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఈ విషయంపై కోర్టుకెక్కాయి. అయితే, శుక్రవారం కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఉద్యోగులను తొలగిస్తూ ఆదివారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి.
USA
USAID
Employees
Paid Leave
Donald Trump

More Telugu News