Shikhar Dhawan: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో శిఖ‌ర్ ధావ‌న్ సంద‌డి... ఇదిగో వీడియో!

Shikhar Dhawan Presents Best Fielder Medal To Axar Patel
  • ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీకి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న గ‌బ్బ‌ర్‌
  • నిన్న‌టి దాయాదుల పోరు సంద‌ర్భంగా మైదానంలో భార‌త ప్లేయ‌ర్ల‌తో చిట్‌చాట్‌
  • మ్యాచ్ అనంత‌రం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ప్ర‌త్య‌క్ష‌మైన ధావ‌న్‌ 
  • ఈ సందర్భంగా అక్ష‌ర్ ప‌టేల్‌కు బెస్ట్ ఫీల్డ‌ర్ అవార్డు అంద‌జేత‌
భార‌త మాజీ క్రికెట‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీకి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ టోర్నీకి మొత్తం న‌లుగురిని ఐసీసీ బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా నియ‌మించ‌గా అందులో గ‌బ్బ‌ర్ ఒక‌డు. ఇక దుబాయ్ వేదిక‌గా నిన్న జ‌రిగిన దాయాదుల పోరుకు ధావ‌న్ విచ్చేసి మైదానంలో సంద‌డి చేశాడు. టీమిండియా ఆటగాళ్ల‌తోనూ మాట్లాడాడు. 
 
ఈ మ్యాచ్ ముగిసిన త‌ర్వాత గ‌బ్బ‌ర్... టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. అక్క‌డ నిన్న‌టి మ్యాచ్‌లో అద్భుత‌మైన ఫీల్డింగ్‌తో అద‌ర‌గొట్టిన అక్ష‌ర్ ప‌టేల్‌కు బెస్ట్ ఫీల్డ‌ర్ అవార్డు అంద‌జేశాడు. అనంత‌రం కొద్దిసేపు భార‌త ప్లేయ‌ర్ల‌తో స‌ర‌దాగా గ‌డిపాడు. 

ఇందుకు సంబంధించిన‌ వీడియోను బీసీసీఐ సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. కాగా, 2023లో జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ నుంచి బీసీసీఐ మేనేజ్‌మెంట్ బెస్ట్ ఫీల్డ‌ర్ మెడ‌ల్‌ను అంద‌జేస్తూ ఓ ఆన‌వాయతీని తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. ఇదే ఆన‌వాయతీని ఇప్పుడు ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీలోనూ కొన‌సాగిస్తోంది.  
Shikhar Dhawan
Team India
Best Fielder Medal
Axar Patel
Cricket
Sports News

More Telugu News