Sridharan Sriram: చెన్నై సూపర్ కింగ్స్ కు కొత్త బౌలింగ్ కోచ్

csk appoints sridharan sriram as assistant bowling coach
  • మార్చి 22 నుంచి ఐపీఎల్– 2025 ప్రారంభం  
  • చెన్నై సూపర్ కింగ్స్ కి కొత్త బౌలింగ్ కోచ్ గా శ్రీధరన్ శ్రీరామ్
  • కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కి మెంటర్‌గా చేరిన అసిస్టెంట్ బౌలింగ్ కోచ్ బ్రావో
  •  
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) – 2025  మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కీలక నియామకం చేపట్టింది. తమిళనాడు మాజీ క్రికెటర్ శ్రీధరన్ శ్రీరామ్‌ను తమ అసిస్టెంట్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. ఇందుకు సంబంధించి సీఎస్‌కే ఎక్స్ వేదికగా సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 

ఇంతకు ముందు సీఎస్‌కేకి అసిస్టెంట్ బౌలింగ్ కోచ్‌గా పని చేసిన బ్రావో .. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కి మెంటర్‌గా చేరారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ నూతన నియామకాన్ని చేపట్టింది. ఈ విషయాన్ని తమ ఎక్స్ ఖాతాలో సీఎస్‌కే ప్రకటించింది. మా అసిస్టెంట్ బౌలింగ్ కోచ్ శ్రీరామ్ శ్రీధరన్‌కు సెల్యూట్ అని పేర్కొంటూ, చెపాక్ పిచ్ నుంచి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లకు చాలా ఏళ్లుగా కోచ్‌గా పని చేసిన శ్రీధరన్ ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడని పేర్కొంది. 
 
కాగా, తమిళనాడుకు చెందిన లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ అయిన శ్రీధరన్ భారతదేశం తరపున ఎనిమిది వన్డేలు ఆడి 81 పరుగులు చేయడంతో పాటు తొమ్మిది వికెట్లు కూడా తీశాడు. 2000 సంవత్సరంలో అరంగేట్రం చేసిన శ్రీధరన్ .. 2004లో చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. శ్రీధరన్ సీఎస్‌కేలో స్టీఫెన్ ఫ్లెమింగ్ (ప్రధాన కోచ్), మైక్ హస్సీ (బ్యాటింగ్ కోచ్), ఎరిక్ సైమన్స్ (బౌలింగ్ కన్సల్టెంట్)తో కలిసి పని చేస్తారు. అతను గతంలో 2016 నుంచి 2022 వరకు ఆస్ట్రేలియాకు అసిస్టెంట్ కోచ్‌గా, తర్వాత బంగ్లాదేశ్‌కు టీ 20 కన్సల్టెంట్‌గా పని చేశాడు. వన్డే ప్రపంచ కప్‌కు ముందు అతను టెక్నికల్ కన్సల్టెంట్‌గానూ పని చేశాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లతో శ్రీధరన్‌కు అనుభవం ఉంది.     
Sridharan Sriram
Sports News
CSK
IPL 2025

More Telugu News