Pawan Kalyan: ఏనుగుల దాడిలో చ‌నిపోయిన మృతుల కుటుంబాల‌కు రూ.10ల‌క్ష‌ల‌ ప‌రిహారం: డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌

Deputy CM Pawan Kalyan Announced Rs10 Lakhs for The Victims of Elephant Attack
  • ఏపీలోని అన్న‌మ‌య్య జిల్లా ఓబుల‌వారిప‌ల్లె మండ‌ల ప‌రిధిలో ఘ‌ట‌న‌
  • గుండాల‌కోన‌లో ఉన్న శివాల‌యానికి వెళుతున్న భ‌క్తుల‌పై ఏనుగుల గుంపు దాడి
  • ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురి మృతి, మ‌రో ఇద్ద‌రికి గాయాలు
ఏపీలోని అన్న‌మ‌య్య జిల్లా ఓబుల‌వారిప‌ల్లె మండ‌ల ప‌రిధిలోని గుండాల‌కోన‌లో ఉన్న శివాల‌యానికి మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా 14 మంది భ‌క్తులు సోమ‌వారం రాత్రి కాలిన‌డ‌క‌న అట‌వీ మార్గంలో వెళ్తున్న స‌మ‌యంలో ఏనుగుల గుంపు వారిపై దాడి చేసింది. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు భ‌క్తులు చ‌నిపోగా, మ‌రో ఇద్ద‌రు గాయ‌ప‌డ్డారు. 

ఈ ఘ‌ట‌న‌పై తాజాగా డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న త‌న‌ను తీవ్రంగా క‌లిచివేసిందన్నారు. అట‌వీ శాఖ అధికారుల‌ను ఈ ఘ‌ట‌న గురించి అడిగి వివ‌రాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాల‌కు ఒక్కొక్క‌రికి రూ. 10ల‌క్ష‌ల చొప్పున, గాయ‌ప‌డిన వారికి రూ. 5ల‌క్ష‌ల చొప్పున‌ ప‌రిహారం ప్ర‌క‌టించారు. 

అలాగే క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్య‌సేవ‌లు అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా అట‌వీ ప్రాంతాల్లో ఉన్న శివాల‌యాల‌కు వెళ్లే భ‌క్తుల‌కు త‌గిన భ‌ద్ర‌త ఏర్పాట్లు చేయాల‌ని ప‌వ‌న్ అధికారుల‌ను సూచించారు. ఈ ఘ‌ట‌న‌పై సీఎం చంద్ర‌బాబు కూడా తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించి ధైర్యం ఇవ్వాల‌ని స్థానిక ఎమ్మెల్యేల‌ను కోరారు. బాధిత కుటుంబాల‌కు అండ‌గా ఉంటామ‌ని చంద్ర‌బాబు భ‌రోసా ఇచ్చారు.    
Pawan Kalyan
Elephant Attack
Andhra Pradesh

More Telugu News