Yuvraj Singh: యువ‌రాజ్ సింగ్ కొడుకుని చూశారా?... ఇదిగో వీడియో!

Yuvraj Singh Wife Hazel Keech Introduces Their Son to Cricket
  • ఇంట‌ర్నేష‌న‌ల్ మాస్ట‌ర్స్ లీగ్ లో అద‌ర‌గొడుతున్న యువీ
  • ఇటీవ‌ల శ్రీలంక మాస్ట‌ర్స్‌తో మ్యాచ్‌లో అద్భుత‌మైన క్యాచ్ ప‌ట్టిన మాజీ క్రికెట‌ర్‌
  • ఈ మ్యాచ్‌ను వీక్షించ‌డానికి స్టేడియానికి వ‌చ్చిన‌ ఆయ‌న అర్ధాంగి హేజెల్ కీచ్‌, కుమారుడు
  • నెట్టింట వైర‌ల్ అవుతున్న యువీ కుమారుడి వీడియో
భార‌త మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ ఇంట‌ర్నేష‌న‌ల్ మాస్ట‌ర్స్ లీగ్ లో అద‌ర‌గొడుతున్న విష‌యం తెలిసిందే. ఇండియా మాస్ట‌ర్స్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న 43 ఏళ్ల యువీ.. తాజాగా శ్రీలంక మాస్ట‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అద్భుత‌మైన క్యాచ్‌తో అంద‌రినీ స్ట‌న్ చేశాడు. బౌండ‌రీ లైన్ వ‌ద్ద‌ గాల్లోకి ఎగిరి క్యాచ్ ప‌ట్టిన ఈ మాజీ ఆల్ రౌండ‌ర్... పాత యువ‌రాజ్‌ను గుర్తు చేశాడు. 

ముంబ‌యిలో జ‌రిగిన ఈ మ్యాచ్‌కు ఆయ‌న అర్ధాంగి హేజెల్ కీచ్‌, కుమారుడు వ‌చ్చి స్టేడియంలో సంద‌డి చేశారు. తనయుడికి మ్యాచ్ చూపిస్తూ క్రికెట్ అంటే ఏంటో, సిక్స్‌, ఫోర్ల గురించి ఆమె వివ‌రించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో అది కాస్తా వైర‌ల్‌గా మారింది. దీంతో చాలా రోజుల త‌ర్వాత యువ‌రాజ్ కుమారుడిని చూసిన అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. జూనియ‌ర్ యువీ రెడీ అవుతున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు.  
Yuvraj Singh
Hazel Keech
Cricket
Team India
Sports News

More Telugu News