Botsa Satyanarayana: పవన్ కల్యాణ్ కు రాజకీయ అవగాహన లేదు: బొత్స సత్యనారాయణ

Pawan Kalyan dont have knowledge on politics says Botsa Satyanarayana
  • జనసేన ప్రతిపక్ష హోదా తీసుకోవాలి లేదా వైసీపీకి ఇవ్వాలన్న బొత్స
  • గవర్నర్ ప్రసంగంలోని అంశాలు సత్యదూరంగా ఉన్నాయని విమర్శ
  • వైసీపీ సభ్యులను లోకేశ్ బెదిరిస్తున్నారని మండిపాటు
జనసేన కంటే తక్కువ సీట్లు వచ్చిన వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండపడ్డారు. పవన్ కల్యాణ్ కు రాజకీయాలపై అవగాహన లేదని అన్నారు. జనసేన ప్రతిపక్ష హోదా తీసుకోవాలని, లేకపోతే వైసీపీకి ఇవ్వాలని అన్నారు. పవన్ అప్పొజిషన్ లో ఉంటానంటే తమకు అభ్యంతరం లేదని చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్యే పదవులను కాపాడుకోవడానికే తాము అసెంబ్లీకి వచ్చామని అంటున్నారని... అది కరెక్ట్ కాదని బొత్స అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ చేసిన ప్రసంగంలోని అంశాలు సత్యదూరంగా ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం అంటూ గవర్నర్ మాట్లాడారని... అది కరెక్ట్ కాదని అన్నారు. కూటమి ప్రభుత్వం 21 యూనివర్సిటీ వీసీలలో 19 మందిని రాజీనామా చేయించిందని... వీసీల రాజీనామాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.   

శాసనమండలిలో వైసీపీ సభ్యులను బెదిరించే విధంగా లోకేశ్ మాట్లాడుతున్నారని బొత్స మండిపడ్డారు. బెదిరింపులకు తాము భయపడబోమని అన్నారు. గ్రూప్-2 పరీక్షల అభ్యర్థులను కూటమి ప్రభుత్వం మభ్యపెట్టిందని దుయ్యబట్టారు. 
Botsa Satyanarayana
YSRCP
Pawan Kalyan
Janasena
Nara Lokesh
Telugudesam

More Telugu News