Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ: ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దు

Match between Australia and South Africa called off due to rain
  • ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు ఆసీస్ × దక్షిణాఫ్రికా
  • రావల్పిండిలో మ్యాచ్
  • ఎడతెరిపిలేని వర్షంతో తడిసి ముద్దయిన మైదానం
  • మ్యాచ్ రద్దవడంతో ఆసీస్, దక్షిణాఫ్రికా జట్లకు చెరో పాయింట్
పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు కీలక మ్యాచ్ రద్దయింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్ వర్షార్పణం అయింది. ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న రావల్పిండిలో వర్షం పడుతుండడంతో మ్యాచ్ ను రద్దు చేశారు. కనీసం 20 ఓవర్ల మ్యాచ్ జరిపేందుకు కూడా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు రిఫరీ ప్రకటించారు. 

ఈ నిర్ణయంతో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా చెరో పాయింట్ పంచుకున్నాయి. గ్రూప్-బి పాయింట్ల పట్టిక చూస్తే... దక్షిణాఫ్రికా, ఆసీస్ చెరో 3 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ ఇంకా ఖాతా తెరవలేదు. గ్రూప్-ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ ఇప్పటికే సెమీస్ చేరిన సంగతి తెలిసిందే. ఆతిథ్య పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు వరుస ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించాయి. 
Champions Trophy 2025
Australia-South Africa
Rain
Rawalpindi
Pakistan

More Telugu News