Mahashivaratri: ప్రారంభమైన శివరాత్రి వేడుకలు.. భక్తులతో ఆలయాల కిటకిట

తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. భక్తులు వేకువజామునే ఆలయాలకు తరలివచ్చి శివయ్యను దర్శించుకుంటున్నారు. దీంతో ప్రముఖ ఆలయాలైన శ్రీకాళహస్తి, శ్రీశైలం, వేములవాడ, కీసర తదితర ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి.
మరోవైపు, మహాశివరాత్రి కోసం ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆలయాల వద్ద తగిన ఏర్పాట్లు చేశారు.
మరోవైపు, మహాశివరాత్రి కోసం ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆలయాల వద్ద తగిన ఏర్పాట్లు చేశారు.