Virat Kohli: వ‌న్డే ర్యాంకింగ్స్‌... టాప్‌-5లోకి దూసుకొచ్చిన కోహ్లీ

Virat Kohli Storms Back Into The Top 5 of the ICC ODI Rankings
  • పాక్‌పై అజేయ శ‌త‌కంతో అద‌ర‌గొట్టిన విరాట్‌ కోహ్లీ 
  • ఒక ర్యాంక్ మెరుగుప‌ర‌చుకుని ఐదో స్థానానికి ఎగ‌బాకిన వైనం
  • 743 రేటింగ్ పాయింట్స్‌తో  ప్ర‌స్తుతం ఐదో స్థానంలో ర‌న్ మెషీన్‌
  • అగ్ర‌స్థానంలో గిల్ (817)... మూడో ర్యాంక్‌లో కెప్టెన్ రోహిత్ (757)
తాజాగా ఐసీసీ ప్ర‌క‌టించిన వ‌న్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ తిరిగి టాప్‌-5లోకి దూసుకొచ్చాడు. ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం నాడు దాయాది పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కోహ్లీ అజేయ శ‌త‌కంతో అద‌ర‌గొట్టిన విష‌యం తెలిసిందే. దాంతో ఒక ర్యాంక్ మెరుగుప‌ర‌చుకుని ఐదో స్థానానికి ఎగ‌బాకాడు. 743 రేటింగ్ పాయింట్స్‌తో కోహ్లీ ప్ర‌స్తుతం ఐదో స్థానంలో కొన‌సాగుతున్నాడు. 

అలాగే భార‌త జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 757 రేటింగ్ పాయింట్స్‌తో మూడో స్థానంలో ఉన్నాడు. మ‌రో భార‌త బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ తొమ్మిదో ర్యాంకులోనే ఉండ‌గా... ప్ర‌స్తుతం భీక‌ర‌మైన ఫామ్‌లో ఉన్న యువ ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్  817 రేటింగ్ పాయింట్స్‌తో  అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఇలా న‌లుగురు టీమిండియా ఆట‌గాళ్లు వ‌న్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో చోటు ద‌క్కించుకున్నారు. 

బౌలింగ్ విభాగంలో శ్రీలంక స్పిన్న‌ర్ మ‌హీశ్ తీక్ష‌ణ మొద‌టి ర్యాంక్‌లో ఉంటే.. ర‌షీద్ ఖాన్‌, కుల్దీప్ యాద‌వ్ వ‌రుస‌గా రెండు మూడు స్థానాల్లో కొన‌సాగుతున్నారు. ఇక మ‌హ్మ‌ద్ షమీ ఒక స్థానం మెరుగుప‌ర‌చుకుని 14 ర్యాంకులో ఉంటే.. మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ రెండు స్థానాలు దిగ‌జారి 12వ ర్యాంక్ ద‌క్కించుకున్నాడు.   
Virat Kohli
ICC ODI Rankings
Team India
Cricket
Sports News

More Telugu News