Rohit Sharma: దుబాయ్ వీధుల్లో రోహిత్ చ‌క్క‌ర్లు... ఒక్క‌సారిగా చుట్టుముట్టిన ఫ్యాన్స్‌... వీడియో వైర‌ల్‌!

Rohit Sharma on Dubai Street During the 2025 Champions Trophy
  • ఛాంపియ‌న్స్ ట్రోఫీ మ్యాచ్‌ల‌ను దుబాయ్‌లో ఆడుతున్న భార‌త్‌
  • ఇప్ప‌టికే వ‌రుస రెండు విజ‌యాల‌తో సెమీస్‌కు టీమిండియా
  • మార్చి 2న కివీస్‌తో ఆఖ‌రి లీగ్ మ్యాచ్
  • స‌మ‌యం దొర‌క‌డంతో దుబాయ్ రోడ్ల‌పై చ‌క్క‌ర్లు కొట్టిన హిట్‌మ్యాన్
భార‌త జ‌ట్టు త‌న ఛాంపియ‌న్స్ ట్రోఫీ మ్యాచ్‌ల‌ను దుబాయ్ వేదిక‌గా ఆడుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే జ‌రిగిన రెండు మ్యాచ్‌ల‌లో విజయం సాధించి సెమీస్‌కు అర్హ‌త సాధించింది. మొద‌టి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించిన టీమిండియా... రెండో మ్యాచ్‌లో చిరకాల ప్ర‌త్య‌ర్థి పాకిస్థాన్‌ను మ‌ట్టిక‌రిపించింది. 

ఇక మూడో మ్యాచ్‌లో ఆదివారం నాడు (మార్చి 2న‌) న్యూజిలాండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఇప్ప‌టికే గ్రూప్‌-ఏ నుంచి సెమీ ఫైన‌ల్ చేరిన ఇరు జ‌ట్లకు ఇది నామమాత్ర‌పు మ్యాచ్ మాత్ర‌మే. అయితే, పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో నిలించేందుకు కివీస్‌, భార‌త్ హోరాహోరీగా త‌ల‌ప‌డే అవ‌కాశం ఉంది. 

కాగా, మూడో మ్యాచ్‌కు ఇంకా స‌మ‌యం ఉండ‌డంతో భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ రిలాక్స్ అవుతున్నాడు. దీనిలో భాగంగా తాజాగా దుబాయ్ వీధుల్లో చ‌క్క‌ర్లు కొట్టాడు. 

ఫీల్డింగ్ కోచ్ దిలీప్‌తో క‌లిసి మంగ‌ళ‌వారం రాత్రి దుబాయ్ స్ట్రీట్స్‌లో ప‌ర్య‌టించ‌గా ఒక్క‌సారిగా అభిమానులు చుట్టుముట్టారు. సెల్ఫీలు దిగేందుకు ఎగ‌బడ్డారు. రోహిత్‌... రోహిత్ అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు. అభిమానులు కొద్దిసేపు తొక్కిసలాట లాంటి పరిస్థితిని సృష్టించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు బ‌య‌ట‌కు రావ‌డంతో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. దుబాయ్‌లో హిట్‌మ్యాన్ క్రేజ్ మామూలుగా లేదుగా అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.   
Rohit Sharma
Champions Trophy 2025
Dubai
Team India
Cricket
Sports News

More Telugu News