Global Investors Meet: భోపాల్ ప్రపంచ ఇన్వెస్టర్ల సదస్సులో భోజనం ప్లేట్ల కోసం పోట్లాట!

Chaos As Attendees Clash Over Plates During GIS in Madhya Pradesh
  • గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో సామాన్యులకు అరకొరగా ఏర్పాట్లు
  • భోజన సమయంలో ప్లేట్ల కోసం పోటీపడిన వీడియో నెట్టింట వైరల్
  • గ్లోబల్ సమ్మిట్‌లో తగిన ఏర్పాట్లు చేయలేదంటూ ప్రతిపక్షాల విమర్శలు
భోపాల్‌లో జరిగిన ప్రపంచ ఇన్వెస్టర్ల సదస్సులో సామాన్యుల కోసం చేసిన ఏర్పాట్లు అరకొరగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సదస్సుకు వచ్చిన సామాన్యులు భోజన ప్లేట్ల కోసం పోట్లాడుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారాయి. 

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో రెండు రోజుల పాటు గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు జరిగింది. ఈ సదస్సును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశ విదేశాల నుండి పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు హాజరై లక్షల కోట్ల మేర పెట్టుబడులను ప్రకటించారు.

అయితే, సామాన్య ప్రజల కోసం సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో... భోజన సమయంలో వారు ప్లేట్ల కోసం పోటీపడిన పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలో కొన్ని ప్లేట్లు విరిగిపడ్డాయి. ప్రపంచస్థాయి పెట్టుబడుల సదస్సులో సరైన ఏర్పాట్లు లేవంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
Global Investors Meet
Madhya Pradesh
BJP

More Telugu News