Afghanistan: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్ ఆటగాడు జాద్రాన్ సరికొత్త రికార్డు

Afghanistan Ibrahim Zadran breaks all time Champions Trophy record
  • ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా జాద్రాన్ రికార్డు
  • ఇంగ్లండ్ క్రికెటర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టిన జాద్రాన్
  • ఏడు వికెట్ల కోల్పోయి 325 పరుగులు చేసిన ఆప్ఘనిస్థాన్
ఆప్ఘనిస్థాన్ బ్యాట్స్‌మన్ ఇబ్రహీం జాద్రాన్ రికార్డు సృష్టించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో జాద్రాన్ 146 బంతుల్లో 177 పరుగులు చేసి ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక స్కోరు చేసిన ఆటగాటిగా రికార్డు సృష్టించాడు. జాద్రాన్ సెంచరీలో 6 సిక్సులు, 12 ఫోర్లు ఉన్నాయి. అతని విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆప్ఘనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి 325 పరుగులు చేసింది. 

ఇప్పటిదాకా ఈ రికార్డు ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ డకెట్ (165) పేరిట ఉంది. బెన్ డకెట్ రికార్డును జాద్రాన్ బద్దలు కొట్టాడు. ఆప్ఘన్ బ్యాటర్లలో జాద్రాన్‌తో పాటు అజ్మతుల్లా 41, మహమ్మద్ నబీ 40, హష్మాతులా షాహిది 40 పరుగులతో రాణించారు. తొలుత జోఫ్రా ఆర్చర్ ధాటికి ఆఫ్గనిస్థాన్ 37 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో జాద్రాన్, అజ్మతుల్లా రాణించారు.
Afghanistan
Cricket
Sports News

More Telugu News