Nagarjuna: యెద్దుల అయ్యప్ప రెడ్డి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా: నాగార్జున

Nagarjuna condolences for the demise of ANR ordent fan Yeddhula Ayyappa Reddy
 
టాలీవుడ్ అగ్రహీరో నాగార్జున సోషల్ మీడియాలో స్పందించారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావుకు వీరాభిమాని అయిన యెద్దుల అయ్యప్ప రెడ్డి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. అయ్యప్ప రెడ్డి అక్కినేని కుటుంబానికి వెన్నెముక లాంటి వ్యక్తి అని నాగార్జున కొనియాడారు. 

"మా కుటుంబం పట్ల ఆయన ప్రేమాభిమానాలు ఎప్పటికీ మరువలేం. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను" అంటూ నాగార్జున ట్వీట్ చేశారు.
Nagarjuna
Yeddhula Ayyappa Reddy
ANR Fan
Demise

More Telugu News