Gaza: గాజాను అద్భుతంగా అభివృద్ధి చేస్తానంటూ ట్రంప్ ఏఐ వీడియో.. హమాస్ రియాక్షన్ ఇదే!

How Hamas Reacted To Donald Trumps AI Generated Video Of Gaza
  • సుందరమైన తీర ప్రాంత పట్టణంగా తీర్చిదిద్దుతానంటున్న ట్రంప్
  • పాలస్తీనియన్ల ఆకాంక్షలను ట్రంప్ ఇప్పటికీ గుర్తించలేదని హమాస్ విమర్శ
  • ఇజ్రాయెల్ బంధనాలను తెంచుకోవడం కోసమే తాము పోరాడుతున్నామని వివరణ
ఇజ్రాయెల్ ప్రతిదాడిలో ధ్వంసమైన గాజాను అద్భుతమైన పట్టణంగా అభివృద్ధి చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో, గాజా రూపురేఖలు ఎలా మారబోతున్నాయో చూడండంటూ ఏఐ వీడియో ఒకదానిని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్రూత్ సోషల్ లో పంచుకున్నారు. ఇందులో సుందరమైన, అభివృద్ధి చెందిన తీరప్రాంత పట్టణంగా గాజాను చూపించారు. ఆకాశాన్ని తాకే భారీ భవనాలు, సుందరమైన బీచ్, ఉల్లాసంగా తిరుగుతున్న ప్రజలతో పాటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కలిసి బీచ్ లో కాక్ టెయిల్ సేవిస్తున్న ట్రంప్ కనిపిస్తున్నారు. బంగారు వర్ణంలో ట్రంప్ భారీ విగ్రహాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. మొత్తానికి గాజాను సంపన్న నగరంగా మార్చేస్తానని ఇందులో ట్రంప్ చూపించారు. 

డొనాల్డ్ ట్రంప్ పంచుకున్న ఈ వీడియోపై హమాస్ ప్రతినిధి స్పందిస్తూ.. దురదృష్టవశాత్తూ అమెరికా అధ్యక్షుడు గాజాలోని పాలస్తీనియన్ల ఆకాంక్షలను అర్థం చేసుకోలేకపోయారని అన్నారు. గాజాలోని పాలస్తీనియన్లు స్వేచ్ఛ కోసం, తమ పిల్లలకు మంచి భవిష్యత్తు కోసం తపన పడుతున్నారని చెప్పారు. ఇజ్రాయెల్ బంధనాల నుంచి గాజా విముక్తి కావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఇనుప సంకెళ్ల బంధనాల మధ్య అభివృద్ధి సాధ్యం కాదని గుర్తుచేశారు. జైలులోని పరిస్థితులను మెరుగు పరచాలనే డిమాండ్ తో తాము పోరాడడం లేదని, ఆ జైలు నుంచి, ఆ జైలర్ నుంచి విముక్తి పొందాలని పోరాడుతున్నామని హమాస్ స్పష్టం చేసింది. గాజా అభివృద్ధి ప్రణాళికలలో స్థానిక పాలస్తీనియన్ల సంప్రదాయాలకు, ఆకాంక్షలకు చోటివ్వాలని సూచించింది.
Gaza
Trump Gaza
AI Video
Hamas
Palastenians
Viral Videos

More Telugu News